NTV Telugu Site icon

Kanthara 2 : షూటింగ్ ప్రారంభం ఎప్పుడో తెలుసా..?

Whatsapp Image 2023 06 23 At 2.34.48 Pm

Whatsapp Image 2023 06 23 At 2.34.48 Pm

కాంతార సినిమా గత సంవత్సరం దేశవ్యాప్తంగా విడుదలయి సెన్సేషనల్ విజయం సాధించింది.. ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు కూడా లేవు. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించింది.. కథ,డైరెక్షన్, మ్యూజిక్ మరియు స్క్రీన్ ప్లే ఇలా అన్నీ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండటంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు రిషబ్ షెట్టి రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. అంచనాలకు మించి కాంతార సినిమా హిట్ కావడంతో మేకర్స్ రెండో భాగాన్ని తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా కాంతార సినిమాకు సీక్వెల్ కాదని, ప్రీక్వెల్ అని ఇప్పటికే మేకర్స్ రివీల్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా రెండో భాగానికి సంబంధించి మరో అప్‎డేట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాంతారలో రిషబ్ శెట్టి తన యాక్టింగ్‎తో అందరిని మెప్పించాడు.ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‎గా మారిపోయాడు రిషబ్. ప్రీక్వెల్‎లో కూడా తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు తెగ కసరత్తులు చేస్తున్నాడట రిషబ్.ఈ ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని సమాచారం.

ఆగస్టు 27 నుంచి కాంతార ప్రీక్వెల్ షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ పనులు అయితే జరుగుతున్నాయి. మొదటి భాగాన్ని తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు మేకర్స్..కానీ రెండో భాగాన్ని మాత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీక్వెల్‎లో భూతకోల నేపథ్యాన్ని మరింత గా ఎలివేట్ చేసి చూపించాలనుకుంటున్నారు. పంజుర్లికి సంబంధించిన ఆ సీన్స్ ఈ ప్రీక్వెల్ లో ఎక్కువగా ఉండనున్నాయి. అందుకే ప్రతి అంశాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా హీరో రిషబ్‌ శెట్టి సెకెండ్ పార్ట్ కోసం గుర్రపు స్వారీలో స్పెషల్ ట్రైనింగ్ ను తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Show comments