NTV Telugu Site icon

Tatkaal Passport: ఎమర్జెన్సీ​గా విదేశాలకు వెళ్లాలా..? అయితే ‘తత్కాల్ పాస్ ​పోర్ట్’ ఎలా​ అప్లై చేయాలంటే..?!

Tatkaal Passport

Tatkaal Passport

మనం మాములుగా త‌త్కాల్ టికెట్ గురించి అందరము వినే ఉంటాము. ముక్యంగా పండ‌గ‌ల స‌మ‌యంలో ఈ మాట బాగా వింటాము. అయితే మీరెప్పుడైనా త‌త్కాల్ పాస్ ​పోర్ట్​ గురించి విన్నారా..? నిజానికి అలాంటి ఓ పాస్ ​పోర్ట్​ ఉంటుంద‌నే విష‌యం కూడా మీకు తెలుసా..? ఇంత‌కీ ఈ త‌త్కాల్ పాస్ ​పోర్ట్​ ఏమిటి..? ఇది పొందడానికి ఎలా ఆన్ ​లైన్ ​లో అప్లై చేసుకోవాలోన్న విషయాలు ఇప్పుడు ఓసారి చూద్దాం. మనం కొన్ని అత్య‌వ‌స‌ర సమయాల్లో లేక చివ‌రి నిమిషంలో త‌ప్ప‌నిస‌రిగా విదేశీ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌చ్చిన‌ సమయంలో జారీ చేసే పాస్​ పోర్టునే ‘త‌త్కాల్ పాస్ ​పోర్ట్​’ అంటారు. ఎలాంటి పెద్ద ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ లాంటివి లేకుండా, దానికోసం రోజుల తరబడి వేచి చూసే అవ‌స‌రం లేకుండా, వేరే దేశాలకి ప్ర‌యాణాలు చేయాల‌నుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందు కోసం ఆన్ ​లైన్ ​లోనే చాలా సింపుల్ గా అప్లై చేసుకోవ‌చ్చు.

Also Read: Amazon Forest: బ్రెజిల్ ​లో​ కార్చిచ్చుల బీభత్సం..!

ఇక తత్కాల్ పాస్​పోర్ట్ కోసం కావాల్సిన పత్రాలు గురించి చూస్తే.. సైట్ లో ఉండే అనెక్సర్-​ ఎఫ్ ​లో వివరించిన వెరిఫికేషన్ సర్టిఫికెట్​ తోపాటు ఎలక్ష‌న్ కార్డు, స‌ర్వీసు ఫొటో ఐడీ కార్డు, కుల ధ్రువీకరణ ప‌త్రాలు,
ఆయుధాల లైసెన్స్, రేష‌న్ కార్డు , ఆస్తి ప‌త్రాలు, పింఛ‌ను ప‌త్రాలు, పాన్ కార్డు, బ్యాంకు పాస్​ బుక్, స్టూడెంట్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్​ సర్టిఫికెట్​, గ్యాస్ క‌నెక్ష‌న్ బిల్లు వీటిలో ఏదైనా 3 ఉంటె సరిపోతుంది. ఇక
తత్కాల్ పాస్​ పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలన్నా విషయానికి వస్తే..

Also Read: WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్​ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!

ముందుగా మనం పాస్​ పోర్డ్​ సేవా వెబ్​ సైట్ ఓపెన్ చేస్తే.. ముందుగా మన వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. దాంతో మనకి ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతుంది. వీటితో వెబ్ ​సైట్ ​లోకి లాగిన్ అయ్యి అక్కడ మనకి Fresh & Reissue అనే రెండు ఆప్ష‌న్లు కనపడతాయి. ఇందులో మనకి కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి. ఆపై Tatkal అనే ఆప్ష‌న్​ను ఎంచుకోని.. అప్లికేష‌న్ ఫార‌మ్ ​లో అగిడే వివ‌రాలు అన్నీ జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత తత్కాల్ పాస్ ​పోర్ట్ సంబంధించిన ఫీజును కూడా ఆన్ ​లైన్ ​లోనే చెల్లించాలి. ఇందుకు సంబంధించి రశీదు ప్రింట్​అవుట్​​ తీసుకోవాలి. ఇక చివ‌ర‌గా మీ ద‌గ్గ‌ర్లోని పాస్ ​పోర్ట్​ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ డేట్ ​ను ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.

Tatkaal Passport, india, certificates, passport portal