NTV Telugu Site icon

IPL 2024: ఫైనల్ విన్నర్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ తెలుసా..?

Srh Vs Kkr

Srh Vs Kkr

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చివరి మ్యాచ్ ఫైనల్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్పై గెలిచి నేరుగా ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే.. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే.. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఫైనల్ మ్యాచ్ లో ఇరుజట్లకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఎందుకంటే.. బ్యాటింగ్ ఆర్డర్లో సన్ రైజర్స్ బలంగా ఉంది.. అటు బౌలింగ్లోనూ మొన్నటి మ్యాచ్లో స్పిన్నర్లు అదరగొట్టారు. కోల్కతా జట్టులోనూ బ్యాటింగ్తో పాటు, బౌలింగ్ విభాగం బలంగా ఉంది.

Read Also: Uttar Pradesh: వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం.. కత్తితో పొడిచి హత్య

ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టుకు భారీగా ప్రైజ్ మనీ లభించనుంది. ఈ మ్యాచ్లో విన్నర్కు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. అలాగే రన్నరప్ కు రూ. 13 కోట్లు ఇవ్వనున్నారు. అంతేకాకుండా.. 3, 4 స్థానాల్లో గెలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ ఇవ్వనుంది. అంతేకాకుండా.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు కూడా ప్రైజ్ మనీ దక్కనుంది. ఒక్కొక్కరికి రూ.15 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్కు రూ. 20 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కు రూ. 12 లక్షలు దక్కనున్నాయి.

Read Also: Anjali : “రత్నమాల” పాత్రలో నటించడానికి కారణం అదే..?