NTV Telugu Site icon

Satyadev-RRR: ఏంటి.. ‘ఆర్ఆర్ఆర్’లో సత్యదేవ్ నటించాడా! జక్కన్న ఎంతపని చేసే

Satyadev Kancharana

Satyadev Kancharana

‘సత్యదేవ్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన సత్యదేవ్.. హీరోగా మారాడు. జ్యోతి లక్ష్మి, తిమ్మరుసు, గువ్వ గోరింక, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ సినిమాలతో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి పేరు సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో విలనిజం చేసి ఆకట్టుకున్నాడు. సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సత్యదేవ్.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా మూవీలోనూ నటించాడు. అయితే ఆ సీన్లన్నీ లేపేశారు.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సత్యదేవ్ కూడా నటించాడట. కానీ అతడు చేసిన సీన్లను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎడిటింగ్‌లో లేపేశాడట. ఈ విషయాన్ని చెప్పాలా, వద్దా అని మొహమాటపడుతూనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ‘ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు 10 రోజులు వర్క్ చేశా. చివరకు నాకు సంబంధించి దాదాపు 16 నిమిషాల సీన్లని ఎడిటింగ్‌లో తీసేశారు. టీమ్‌పై ఉన్న గౌరవంతో ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఆ పది రోజులు వర్క్ చేయడంను మర్చిపోలేని అనుభూతి’ అని సత్యదేవ్ తెలిపాడు.

Also Read: Robinhood Teaser: నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!

సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్‌ కార్తీక్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘జీబ్రా’. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్‌ పిసినాటో కథానాయికలు. ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేశ్‌ సుందరం సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 22న జీబ్రా రిలీజ్ అవుతోంది. నేడు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతోన్నారు. చిరు రాకతో జీబ్రా మూవీ మీద బజ్ పెరగడం ఖాయం. ఎన్నో ప్రయోగాలు చేస్తున్న సత్యదేవ్‌‌కు హీరోగా సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. జీబ్రాతో అయినా హిట్ అందుకుంటాడో చూడాలి.

Show comments