NTV Telugu Site icon

Over Sleeping : అతిగా నిద్రపోతే.. అటునుంచి అటే

Sleeping

Sleeping

Over Sleeping : రోజంతా అలసిన శరీరానికి తప్పకుండా విశ్రాంతి కావాలి. అందుకే ప్రతి మనిషి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. నిద్ర పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. చాలామంది రోజులో ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఇష్టపడతారు. అయితే ప్రతిరోజు ఎనిమిది గంటల నిద్ర మాత్రమే అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సరైన నిద్ర మానసిక ప్రశాంతతని, ఒత్తిడిని తగ్గించి జీవితకాలం పాటు ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది. నిద్రలేమితో బాధపడుతున్న లేదా అతిగా నిద్రపోయినా ఈ రెండు అనారోగ్య సూచికలుగా భావించవచ్చు. అతిగా నిద్రించే వారి శరీరం బద్దకంగా తయారవుతుంది. దాంతో మెదడు పనితీరుపై ప్రభావం చూపి స్వతహాగా ఆలోచించే శక్తి లోపిస్తుంది. దీంతో మెద‌డు మొద్దుబారిపోతుంది. తద్వారా సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక మానసికక్షోభతో బాధపడాల్సి వస్తుంది.

Read Also: China Pig: చైనాలో షాకింగ్ ఘటన… పంది పైనే అనుమానం

ప్రతిరోజు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మన శరీరంలోని కొవ్వు పదార్థాలు పేరుకుపోయి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులు చుట్టుముడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అతిగా నిద్ర పోతే గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానివల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ సమయం నిద్రించే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవడం మంచిది. అతినిద్ర వ్యాధితో బాధపడేవారు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లవచ్చు. ఎందుకంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల మనిషి శారీరక శ్రమ తగ్గుతుంది. దాంతో మెదడుపై తీవ్ర ప్రభావం పడి మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది.అందుకే కేవలం ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోతూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Arvind Dharmapuri : ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ తిట్లపురాణం