NTV Telugu Site icon

Dogs Chasing: మీరు బైక్‌పై వెళ్లినప్పుడు కుక్కలు వెంబడించాయా..? కారణం ఏంటో తెలుసా

Dogs

Dogs

బైక్ పై గానీ, కార్లలో గానీ వెళ్తున్నప్పుడు కుక్కలు వాహనాల వెనుక పరుగెత్తుకుంటూ వస్తాయి. విచిత్రం ఏంటంటే.. సాధారణంగా రోడ్డుపై వెళ్లే వారిని ఏమీ చేయవు కానీ.. కదులుతున్న వాహనాన్ని వెంబడిస్తూ ఒక్కోసారి కొన్ని కిలోమీటర్ల మేర పరుగెత్తుకుంటూ వస్తాయి. ఇలాంటి పరిస్థితి మీ జీవితంలో కూడా ఎదురై ఉంటుంది.. ఒక్కోసారి మన వాహనం వెనుక పరిగెత్తుకుంటూ వస్తుందన్న భయంతో వాహనంపై బ్యాలెన్స్ తప్పి పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే.. కుక్కలు ఇలా పరిగెత్తడం వెనక కారణం మీకు వచ్చి ఉంటుంది. అందుకు సంబంధించి కారణాలను మనం తెలుసుకుందాం.

UP: షాకింగ్.. డబ్బుపై దురాశతో మళ్లీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు

కుక్క ముక్కులు మానవ ముక్కుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అవి చాలా దూరంలో ఉన్న ఎలాంటి వాసననైనా పసిగట్టగలవు. మీ కారు, బైక్ వేరే ప్రదేశాల్లో వెళ్లినప్పుడు ఇతర కుక్కల మూత్రం వాసన కారు టైర్లలో ఉండిపోతుంది. ఈ క్రమంలో.. కుక్కలు ఈ వాసనను గుర్తించి మరో కుక్క తమ ప్రాంతంలోకి ప్రవేశించిందని అర్థం చేసుకుంటాయి. అందుకే కుక్కలు మీ కారును వెంబడిస్తూ మొరుగుతాయి. అలాగే.. వాహనాల టైర్లపై కుక్కలు మూత్ర విసర్జన చేయడం మీరు తరచుగా చూస్తారు. ఆ స్థలం తమదేనని ఇతర కుక్కలకు తెలియజేసేందుకు మూత్ర విసర్జన చేస్తాయి. మీ కారు ఒక ప్రాంతంలోకి వెళ్లినప్పుడు.. ఇతర కుక్కలు ముందుగా టైర్‌పై మూత్ర విసర్జన చేసిన కుక్క వాసనను పొందుతాయి. దీంతో తమ ప్రాంతంలోకి ఓ కుక్క వచ్చిందని భావించి కుక్కలు మీ కారును వెంబడిస్తాయి.

President Droupadi Murmu: రేపు ఏపీ పర్యటనకు రాష్ట్రపతి.. AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము..

కుక్కలు చాలా భావోద్వేగ జంతువులు.. అవి తమ సహచరులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. వాహనం ఎప్పుడైనా తమ సహచరులను గాయపరిచినా, హాని కలిగించినా.. కుక్కలు ఆ వాహనాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా కుక్కలు వాహనాన్ని చూసి మొరగడం, వెంబడించడం చేస్తాయి. ఇది కుక్కలకు ఒక రకమైన ప్రతీకారం లాంటిది.. కుక్కలు తమ భాగస్వామి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాయి.

Show comments