ఎండలు దంచికొడుతున్నాయి. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానియాలు, వాటర్ మిలన్స్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వేసవిలో పుచ్చకాయ తినడానికి అందరూ ఇష్టపడతారు. పుచ్చకాయ పీసులుగా చేసుకుని, జ్యూస్ చేసుకుని తాగేస్తుంటారు. అయితే పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తుంటారు. కానీ చాలా ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో పుచ్చకాయను నిల్వ చేయడం వల్ల అది వినియోగానికి పనికిరాదని అంటున్నారు నిపుణులు. పుచ్చకాయను ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లయితే, పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అది శరీరానికి హాని చేస్తుందంటున్నారు నిపుణులు. మరి పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఎంతకాలం నిల్వ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.
Also Read:Yellamma : చివరి నిమిషంలో సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా..!
గాలి చొరబడని కంటైనర్‌లో పుచ్చకాయను నిల్వ చేయడం వల్ల దాని రుచి, పోషకాలు సంరక్షించబడతాయి. కానీ, పుచ్చకాయను ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల దాని రుచి, పోషకాలు తగ్గుతాయి. అందువల్ల పుచ్చకాయను 1 రోజు కంటే ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్‌లో ఉంచవద్దు. ఎందుకంటే పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు కొన్ని గంటల తర్వాత వాసన రావడం ప్రారంభమవుతుంది. పుచ్చకాయ తాజాగా ఉన్నప్పుడు రుచి, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ తాజాగా తినడానికి ప్రయత్నించాలి.