NTV Telugu Site icon

DK.shivakumar: ప్రత్యర్థుల పూజలపై డీకే.శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

Dke

Dke

కర్ణాటక డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా కేరళలోని ఓ ఆలయంలో రాజకీయ ప్రత్యర్థులు ‘అఘోరీలు’, ‘తాంత్రికుల’ ద్వారా మాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Buchi Babu: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు ఇంట్లో తీవ్ర విషాదం!

శివకుమార్ మీడియా మాట్లాడారు. కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ‘అఘోరీలు’ యాగం నిర్వహిస్తున్నట్లు తనకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే కర్మకాండ చేస్తున్నారని తెలిపారు. యాగం యొక్క ప్రధాన లక్ష్యం శత్రువులను నిర్మూలించడం. పూజలో పాల్గొన్న వారు ఈ పరిణామం గురించి తెలియజేసారని ఆయన చెప్పారు. అఘోరీల ద్వారా 21 ఎర్ర మేకలు, మూడు గేదెలు, 21 నల్లగొర్రెలు, ఐదు పందులను చేతబడికి బలి ఇస్తున్నారని తెలిసిందన్నారు.

ఇది కూడా చదవండి: Vijayawada: విజయవాడలో భారీగా డయేరియా కేసులు.. రేపు నీటి టెస్టుల రిపోర్ట్..!

దీనికి కార్ణాటకకు చెందిన బీజేపీ, జేడీఎస్ రాజకీయ నాయకులే కారణమని ఆయన అన్నారు. ఈ ఆచారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో తనకు తెలుసు అని చెప్పారు. వారు తమ ప్రయత్నాలను కొనసాగించనివ్వండన్నారు. వాళ్లు ఎన్ని చేసినా తాము నమ్మిన శక్తి రక్షిస్తుందని శివకుమార్ చెప్పుకొచ్చారు. ఈ ఆచారానికి వ్యతిరేక పూజలు చేస్తారా? అన్న ప్రశ్నకు శివకుమార్ సమాధానమిస్తూ.. తాను ప్రతిరోజూ పనికి వెళ్ళే ముందు ఒక నిమిషం పాటు దేవుడిని ప్రార్థిస్తానని చెప్పారు.

జూన్ 2న బెంగళూరులో శాసనసభ్యుల సమావేశం ఉంటుందని శివకుమార్ ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi : కన్యాకుమారిలోని వివేకానంద విగ్రహం ముందు ప్రధాని మోడీ ధ్యానం..ఫోటో రిలీజ్