Site icon NTV Telugu

DK Shivakumar: కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు స్పందించిన డీకే..

Dk

Dk

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు. సెక్స్ స్కాండల్ గురించి తెలిసి కూడా జనతాదళ్ (సెక్యులర్)తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తు పెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై డీకే శివకుమార్ మంగళవారం ఎదురుదాడికి దిగారు.

Crew: ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ బాలీవుడ్ కామెడీ డ్రామా..

రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్‌ కాంగ్రెస్‌తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్‌ షా చెప్పాలి’అని డీకే డిమాండ్‌ చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్‌ కార్తిక్‌ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు.

MI vs LSG: లక్నో ముందు స్వల్ప లక్ష్యం.. ముంబై ఎంత స్కోరు చేసిందంటే..?

ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల వ్యవహారం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతుంది. కాగా.. ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ భవిష్యత్‌ ఆందోళనకరంగా మారింది. పరిస్థితులను చూస్తే ప్రజ్వల్ రేవణ్ణ పెద్ద చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్‌ ఈసారి కూడా హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై కర్నాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసి.. ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకునేందుకు విచారణను స్పీడప్ చేసింది. జాతీయ మహిళా కమిషన్ కూడా ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై స్పందించింది. దేశం విడిచి వెళ్లిన రేవణ్ణను పట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని కర్నాటక పోలీసులను ఆదేశించింది.

Exit mobile version