DK Aruna: కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటే నమ్మేస్తారా?
- సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు
- కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటే ముక్కున వెలిసుకుంటారు
- ఏ రాజకీయం లబ్ది కోసం కవిత ఆ డైలాగులు కొట్టిందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించడంపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంభం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్నదన్నారు. కల్వకుంట్ల కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటే ముక్కున వెలిసుకుంటారు తప్పితే, ఎవరు నమ్మరు అని విమర్శించారు. ఏ రాజకీయం లబ్ది కోసం కవిత ఆ డైలాగులు కొట్టిందో తెలియదు? అని డీకే అరుణ ఎద్దేవా చేశారు.
ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ… ‘ఏం రాజకీయం కోసం కల్వకుంట్ల కవిత ఆ డైలాగులు కొట్టిందో తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంభం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగం ఉంది. ఇప్పుడొచ్చి కవితమ్మ కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటే ముక్కున వెలిసుకుంటారు తప్పితే.. ఎవరు నమ్మరు. కాళేశ్వరం విషయంలో కమిటీ, నివేదికలంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ కావాలనే తాత్సరం చేసింది. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని తప్పించాలనే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే ఈ కేసును సీబీఐకి అప్పగించొచ్చు కదా. కమిటీలు, విచారణలు, నివేదికలు అన్నారు. ఆ నివేదికలో ఏముందో ఎందుకు బయట పెట్టలేదు?. చివరకు అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ పెట్టి సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు’ అని చెప్పారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Mitchell Starc: మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం!
‘కాళేశ్వరం విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది కాంగ్రెస్ తీరు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ముందు నుంచి కోరుతున్నది. ఎదో చేద్దాం అనుకున్నారు, ఏమి చేయలేరని తేలిపోయింది.. ఇప్పుడు చేతులు ఎత్తేశారు. ఇప్పటికైనా సీబీఐ విచారణకు కాంగ్రెస్ సహకరించాలి. కవిత కూడా కేసీఆర్ ఫ్యామిలే కదా. కాళేశ్వరం డిజైన్ చేసిందే నేను అని కేసీఆర్ స్వయంగా చెప్పారు. పార్టీ నేతలు కూడా అదే చెప్పారు. ఇప్పుడు కేసు విచారణకు వస్తే.. కేసీఆర్‌కు ఏ పాపం తెలియదు అంటే నమ్మేస్తారా?. కవిత మాటలు ఎవ్వరు నమ్మరు’ అని ఎంపీ డీకే అరుణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!