తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తెలిపారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళేందుకు ఈరోజు మీటింగ్ లో చర్చించామన్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల్లో ముఖ్య నేతల పర్యటన ఉంటుందని ఆమే పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఫిబ్రవరి 5 నుండి 8 వరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు తమకు కేటాయించిన గ్రామంలో 24 గంటలు ఉంటారు.. అక్కడ ప్రజలతో మమేకం అవుతారని డీకే అరుణ తెలిపారు. మరోవైపు.. తెలంగాణ నుండి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. ఈ నెల 5 నుండి బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫిబ్రవరి 18 నుండి 24 వరకు నారీ శక్తి వందన్ కార్యక్రమం.. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారుల సమ్మేళనాలు.. ప్రతి పార్లమెంట్, అసెంబ్లీలో ఎన్నికల కార్యాలయాలు ఏర్పాటు లాంటివి నిర్ణయించామని తెలిపారు.
South Indian actors: ఈ స్టార్ హీరోలు.. రాజకీయ పార్టీలు ఏ వయస్సులో స్థాపించారో తెలుసా.. ?
కేసీఆర్ ను ఓడించాలని ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ కు ఓటు వేశారని డీకే అరుణ తెలిపారు. కేసీఆర్ అవినీతి, కక్ష సాధింపులకు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. ఎన్నికల్లో భాగంగా.. బీజేపీ పై దుష్ర్పచారం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో హమీలు ఎక్కువగా ఉన్నాయి.. ఇచ్చిన హామీలు తప్పించుకోవడం కోసం అప్పులు ఉన్నాయని ఈరోజే తెలిసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుందని దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికలు వెంటనే ఎందుకు పెట్టడం లేదు.. గెలుస్తామని ధీమా లేకపోవడమే ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు. సర్పంచ్ లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
Hyderabad: హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠా అరెస్ట్..
పార్లమెంట్ ఎన్నికలకు మీరిచ్చిన 6 గ్యారంటీలకు ఏమీ సంబంధమని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అట.. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా అని మండిపడ్డారు. తెలంగాణలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని మాయ మాటలు చెబుతున్నారని తెలిపారు. కేసీఆర్ లాగానే కాంగ్రెస్ వాళ్లు వ్యవహరిస్తున్నారు.. ఇద్దరికీ తేడా లేదని దుయ్యబట్టారు. బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ప్రధాని దగ్గరికి వెళ్లి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరి.. ఇక్కడకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ 10 నుండి 12 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.