NTV Telugu Site icon

DK Aruna : ప్రీతి మృతి చాలా బాధాకరం.. సైఫ్‌ పై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేయాలి

Dk Aruna Comments

Dk Aruna Comments

ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్యాయత్నం చేసిన కేఎంసీ పీ.జీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి చెందడం చాలా బాధాకరం. ఈ విషాద సమయాన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తునానన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. సీనియర్ వైద్య విద్యార్థి “సైఫ్” తనను వేధిస్తున్నాడని ప్రీతి పలుసార్లు ఫిర్యాదు చేసినా… పట్టించుకోని కెఎంసి ప్రిన్సిపాల్, HOD మరియు స్థానిక పోలీసులు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను నియంత్రించలేని కెసిఆర్ ప్రభుత్వం ఈ మృతికి పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. గిరిజన కుటుంబానికి చెందిన ప్రీతి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ప్రతిష్టాత్మక వైద్య విద్యను కొనసాగిస్తూ “సైఫ్” వేధింపులకు తాళలేక ఇలా నిష్క్రమించడం చాలా విషాదకరమన్నారు.

Also Read : Arvind Kejriwal: డర్టీ పాలిటిక్స్.. మనీష్ సిసోడియా అరెస్టుపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం

ప్రీతిపై కక్ష కట్టి మానసికంగా వేధిస్తూ ఈరోజు తన చావుకు కారణమైన “సైఫ్” పై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేయాలన్నారు. ప్రీతి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తన మొబైల్ ను ఉపయోగించి కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఉదంతంపై హైకోర్టు సెట్టింగ్ న్యాయ మూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్ లో ప్రీతి లాంటి విద్యార్థులు అర్ధాంతరంగా తమ జీవితాన్ని ముగించుకోకుండా కాపాడవలసిన అవసరం ఉంద్నారు డీకే అరుణ.

Also Read : Bopparaju Venkateswarlu: ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు క్షమించవు

Show comments