NTV Telugu Site icon

DK Aruna : ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయం

Dk Aruna

Dk Aruna

హైడ్రా లక్ష్యం సంచులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమకూర్చడమే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని, ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయమని ఆమె మండిపడ్డారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం బెంబేలెత్తిస్తోందని, హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు డీకే అరుణ. హైదరాబాద్ రావాలంటే పెట్టుబడి దారులు భయపడాల్సిన పరిస్థితి అని, కేసీఆర్ కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందన్నారు డీకే అరుణ. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ ప్రజలు గమనిస్తున్నారని, అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా ? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్లే మాట్లాడారు.. గతంలో మాట్లాడింది మర్చిపోయారా ? అని ఆమె ప్రశ్నించారు.

Ashwini Vaishnaw: ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్.. పండుగల సందర్భంగా 6,000 ప్రత్యేక రైళ్లు

అంతేకాకుండా.. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, కొందరికి ఒకలా… మరికొందరికి ఇంకోలా నిబంధనలు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేశారని, వక్ఫ్ యాక్ట్ 2024 సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు హైదరాబాద్ కు రాబోతుందన్నారు డీకే అరుణ. వివిధ రాష్ట్రాల్లో కమిటీ ఇప్పటికే పర్యటించింది.. అందులో భాగంగా రేపు హైదరాబాద్ లో కమిటీ పర్యటిస్తోందని, తాజ్ కృష్ణ హోటల్ లో రేపు కమిటీని కలిసి వినతిపత్రాలు ఇవ్వవచ్చన్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుపై దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దని, వక్ప్ బోర్డులు కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నారు. పేద ముస్లీంలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు డీకే అరుణ.

UP: యూపీలో ఘోరం.. క్షుద్ర పూజలకు విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం