తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం నేడు జరిగింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తేలేదు.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగాయని ఆయన వెల్లడించారు. కేంద్రానికి దర్యాప్తు సంస్థలు ఉంటే.. మనకు సైతం దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఇక బీజేపీ ప్రభుత్వంపై యుద్ధమేనన్నారు. అయితే.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడో టీఆర్‌ఎస్‌పై యుద్ధం ప్రకటించిందన్నారు. టీఆర్‌ఎస్ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని డీకే అరుణ స్పష్టం చేసారు.
Also Read : Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ సంచలన ప్రకటన.. బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ నిజమే..!!
ముఖ్యమంత్రి కూతురిని బీజేపీ ఆహ్వానించింది అనడం ఆయన చిల్లర రాజకీయాలకు పరాకాష్ట అని డీకే అరుణ ఫైర్ అయ్యారు. మీ లాంటి అవినీతిపరులను బీజేపీ ఆహ్వానించే పరిస్థితి లేదని, మీ లాంటి అవినీతి కుటుంబం నుంచి బీజేపీలోకి రావాలని ఎవరు కోరుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేలను బయటకు వస్తే ఎక్కడ బండారం బయట పెడుతారనే భయంతోనే ముఖ్యమంత్రి తన వద్దనే నలుగురు ఎమ్మెల్యేలను పెట్టుకున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి స్వతంత్ర దర్యాప్తు సంస్థలపై ఎదురు దాడి చేయమని కేసీఆర్ పిలుపునియ్యడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంతో సమానమని ఆమె మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఆమె వెల్లడించారు.
