Site icon NTV Telugu

DK Aruna : అభద్రత భావంతోనే రెండు చోట్ల కేసీఆర్ పోటీకి సిద్ధమైండు

Dk Aruna Comments

Dk Aruna Comments

అభద్రత భావంతోనే రెండు చోట్ల పోటీకి కేసీఆర్ సిద్ధమయ్యారని విమర్శించారు బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కేసీఆర్‌ రోజుకో ప్రకటన చేస్తున్నారని ఆమె అన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్‌ మోసాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలపై గ్రామ గ్రామాన అవగాహన తేవాలని పార్టీ శ్రేణులక పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ రెండూ బీజేపీ నీ టార్గెట్ చేస్తూ ప్లాన్ గా ముందుకి వెళ్తున్నాయని ఆమె ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టాలని, నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకించిన మహేశ్వర రెడ్డి పై లాఠీ చార్జి చేసి దుర్మార్గంగా వ్యవహరించారు డీకే అరుణ.

Also Read : Renu Desai: ఆయనతో పవన్ మాజీ భార్య.. ఫ్యాన్ మూమెంట్ అంటూ పోస్ట్

పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అరెస్ట్ చేశారని ఆమె మండిపడ్డారు. రైతుల తరఫున మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేస్తుంటే అడ్డుకున్నా రని, రైతులు ఆందోళన చేస్తుంటే కేసీఆర్ కు బాధ్యత లేదా? అని ఆమె ప్రశ్నించా రు. తెలంగాణ కోసం ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశాడని అన్నారు. నిర్మల్ లో మాస్టర్ ప్లాన్ తో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, 220 జీవో రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూదందా జరుగు తోందని, వేల ఎకరాల భూములను అమ్ముతూ, కేసీఆర్ కుటుంబం మిగతా భూములను దోచుకుంటోందన్నారు. ఎన్నికలకు మూడు నెలల సమయం కూడా లేదని, మోర్చలంత కలసి కట్టుగా పని చేయాలన్నారు డీకే అరుణ.

Also Read : Renu Desai: ఆయనతో పవన్ మాజీ భార్య.. ఫ్యాన్ మూమెంట్ అంటూ పోస్ట్

Exit mobile version