NTV Telugu Site icon

DK Aruna : బడ్జెట్ బడుగు బలహీనవర్గాలకు ఊతం ఇచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉంది

Dk Aruna

Dk Aruna

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్‌ సమావేశాల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. బడ్జెట్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీనవర్గాల కు ఊతం ఇచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉందన్నారు. అంతేకాకుండా.. రైతులకు 20 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడంతో పాటు “శ్రీ అన్న ” పథకం ద్వారా చిరు ధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహం అందించి దేశాన్ని హరిత అభివృద్ధి వైపు నడిపించే నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. నవ భారత నిర్మాణం దిశగా భారత దేశాన్ని నడిపించడానికి, దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనను ఈ బడ్జెట్ వేగవంతం చేస్తుందని డీకే ఆరుణ అన్నారు.

Also Read : Layoff in paypal : నేడు పే పాల్ వంతు.. ఊడిపోయిన 2000ఉద్యోగాలు

పేదల ఇళ్ళ నిర్మాణం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 79 వేల కోట్లు కేటాయించడం గర్వకారణమన్నారు డీకే అరుణ. దేశ వ్యాప్తంగా 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను దిజిటలైజ్ చేయడం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించడం రైతాంగానికి మేలు చేసే చర్య అని డీకే అరుణ అన్నారు. ఇదిలా ఉంటే.. బడ్జెట్‌ సమావేశాల్లో.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఏ వస్తువులు చౌకగా ఉంటాయో, ఏ వస్తువుల ధరలు ప్రియంగా మారనున్నాయో వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో మొబైల్స్‌, టీవీలు, కెమెరాల విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. దిగుమతి చేసుకునే బంగారు ఆభరణాలపై బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. అలాగే సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచింది.

Also Read : Budget 2023: మూలధన వ్యయం భారీగా పెంపు.. 33 శాతం పెరిగి రూ.10లక్షల కోట్లకు చేరిక