Novak Djokovic : సెర్బియా యోధుడు.. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (Novak Djokovic) కొత్త చరిత్ర లిఖించాడు. మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో నోవాక్ జొకోవిచ్ క్యాస్పర్ రూడ్‌ను ఓడించాడు. తద్వారా పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా అవతరించాడు. ఈ మ్యాచ్ ముందు వరకు కూడా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన పురుషుల జాబితాలో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు.
Read Also: Samantha: సమంత నాటకాలాడుతోంది.. ఏకిపారేస్తున్న ట్రోలర్స్
టెన్నిస్ లెజెండ్ నోవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ 2023లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుపొందాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌ను 7-6, 6-3, 7-5 తేడాతో ఓడించాడు. అంతేకాకుండా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నందుకు రికార్డుకెక్కాడు. నాదల్ 22 టైటిల్స్ తో రెండో స్థానంలో.. ఫెడరర్ 20 టైటిల్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు.
Read Also: RSS: బక్రీద్ రోజు ఆవులను దానం చేయాలని, బలివ్వకూడదని ఆర్ఎస్ఎస్-ముస్లిం మంచ్ నిర్ణయం
క్యాస్పర్ దూకుడుగా ఆరంభించాడు. ఆరంభంలోనే జొకోవిచ్ సర్వీస్ ను బ్రేక్ చేసి లీడ్ లోకి వచ్చాడు. అయితే అనంతరం జొకోవిచ్ కూడా రూడ్ సర్వీస్ ను బ్రేక్ చేసి స్కోరును సమం చేశాడు. అనంతరం ఇరువురు కూడా తమ సర్వీస్ లను నిలబెట్టుకోవడంతో మ్యాచ్ టై బ్రేక్ కు దారి తీసింది. తొలి సెట్ లో రూడ్ అద్భుతంగా ఆడాడు. ఇక రెండో సెట్ నుంచి జొకోవిచ్ అదరగొట్టాడు. తొలి గేమ్ లోనే రూడ్ సర్వీస్ ను బ్రేక్ చేశాడు. అనంతరం తన సర్వీస్ లను నిలబెట్టుకుంటూ రెండో సెట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక మూడో సెట్ లోనూ ఇదే దూకుడు కనబరిచి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు.