NTV Telugu Site icon

Andhra Pradesh: మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. కొత్త పథకానికి శ్రీకారం

Free Gas Cylinder Scheme

Free Gas Cylinder Scheme

Andhra Pradesh: ఏపీలో మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుకను అందించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్‌-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఏడాదికి రూ.2,684 కోట్లతో ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మహిళా సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని… దీపం పథకం గొప్ప ముందడుగు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ చేయాలని సీఎం సూచించారు.

Read Also: CM Chandrababu: ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

దీపం పథకం ఈ దీపావళి పండుగతో ఇళ్లల్లో వెలుగులు తెస్తుందన్నారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా.. పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. ఈ నెల 31 తేదీన దీపావళి పథకం ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎల్పీజి గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హతగల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం వచ్చిందన్నారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ. 876లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు 25ల సబ్సిడీ ఇస్తుండగా.. ప్రస్తుతం ప్రతి సిండర్ ధర రూ.851గా ఉందన్నారు. ప్రభుత్వంపై 2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుందని.. ఐదేళ్ళకు కలిపి 13వేల 423 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.