NTV Telugu Site icon

Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్!

Indian Railways

Indian Railways

Diwali Bonus For Railway Employees: కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని., మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో కొత్తగా 3 కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మిగితా సగం రాష్ట్రం భరిస్తాయి. ఇది కాకుండా, రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత లింక్డ్ బోనస్ (PLB) ఆమోదించబడింది. ఇందులో భాగంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వనున్నారు. కేబినెట్ నిర్ణయంతో 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.

Vande Bharat Train: మరోమారు వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. భయపడిపోయిన ప్రయాణికులు!

రైల్వే ఉద్యోగుల మంచి పనితీరు కోసం 11,72,240 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే రూ.2,029 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్‌బీ)కి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార ప్రసార, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ట్రాక్ మెయింటెయినర్, లోకో పైలట్, రైలు మేనేజర్ (గార్డ్), స్టేషన్ మాస్టర్, సూపర్‌వైజర్, టెక్నీషియన్, టెక్నీషియన్ హెల్పర్, పాయింట్స్‌మన్, మినిస్టీరియల్ సిబ్బంది ఇంకా ఇతర ఉద్యోగుల వంటి వివిధ కేటగిరీల రైల్వే ఉద్యోగులకు ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Biggboss 8: మిడ్ వీక్ ఎలిమినేషన్.. అంతాకలిసి ఆదిత్య ఓంని పంపించారుగా

చెన్నై మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. రూ.63,246 కోట్లతో చెన్నై మెట్రో రెండో దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 119 కి.మీ పొడవైన ఈ రెండవ దశ 3 కారిడార్లుగా విభజించబడింది. ఇందులో 120 స్టేషన్లను కలిగి ఉంటుంది. 120 స్టేషన్లు నిర్మించబడనున్నాయి. తద్వారా ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్ల నుండి నడక దూరంలో మెట్రోను ఉపయోగించుకోవచ్చు. ఇందులో భాగంగా టోక్యో ఉదాహరణను పరిశీలిస్తే, ప్రతి ప్రదేశం నుండి నడక దూరంలో మెట్రో అందుబాటులో ఉంటుంది. చెన్నై మెట్రోలోనూ అదే పద్ధతిని అవలంబిస్తామని తెలిపారు.