Site icon NTV Telugu

Divvela Madhuri: కారు ప్రమాద ఘటనపై మాధురి ఆసక్తికర విషయాలు..

Madhuri

Madhuri

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగిఉన్న కారును మాధురి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలు కాగా.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మాధురిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. చాలా సేపు బలవంతం చేసిన తర్వాత వైద్యులు చికిత్స అందించారు.

The Birthday Boy OTT: ఆహాలో దూసుకుపోతోన్న ‘ది బర్త్‌డే బాయ్’

ఈ సమయంలో మాధురి మీడియాతో మాట్లాడారు. అయితే తాను చనిపోవాలనే ఉద్దేశంతో మరో కారును ఢీకొట్టానని తెలిపింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక చనిపోవాలనుకున్నానని పేర్కొంది. సూసైడ్ చేసుకునేందుకు పలాస బయల్దేరానని చెప్పింది. తనది సెల్ఫ్ ఆక్సిడెంట్ అని అన్నారు. పిల్లలు తనను జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించటంతో బాధ అనిపించిందని.. తనపై ఆరోపణలు చేస్తే భరిస్తాను కానీ, పిల్లల గురించి మాట్లాడితే భరించలేనని చెబుతోంది. అందుకే మనస్తాపంతో స్వీయ ప్రమాదం చేసుకుని చనిపోవాలనుకున్నానని మాధురి తెలిపింది. మరోవైపు.. తనను పోలీసులు ఇబ్బంది పెట్టారని.. బ్లడ్ శాంపిల్స్ పేరుతో ఇబ్బందులు గురి చేశారంది.

St Martin’s Island: షేక్ హసీనాని గద్దె దించిన ‘‘ద్వీపం’’.. అమెరికాకి సెయింట్ మార్టిన్స్‌పై ఆసక్తి ఎందుకు..?

కాగా.. పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. ఈ అంశంపై పలాస డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాధురి కారు యాక్సిడెంట్ పై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇన్విస్టిగేషన్ జరుగుతుందని తెలిపారు. తాము తనను మేనాప్లీట్ చేస్తున్నామని మాధురి చెప్పటం కరెక్ట్ కాదన్నారు. యాక్సిడెంట్ కేసుల్లో కామన్ గా బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తాం.. కేసు తీవ్రత దృష్ట్యా తమ నిబంధనలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.

Exit mobile version