Site icon NTV Telugu

AP: 598 మార్కులు సాధించిన విద్యార్థిని.. అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు

Student

Student

పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సత్తా చాటింది. విద్యార్థిని పావని చంద్రిక కారంపూడి మండలం ఒప్పిచర్ల ప్రభుత్వ పాఠశాలలో చదివి 598 మార్కులు సాధించింది. విద్యార్థిని పావని చంద్రికని జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు. నరసరావుపేటలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్థిని పావని చంద్రిక, ఆమె తల్లిదండ్రులు, పాఠశాల HM లను పిలిచి సన్మానించి స్వీట్లు తినిపించారు జిల్లా డీఈఓ చంద్రకళ.

Also Read:CM Chandrababu: వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులు

ఈ సందర్భంగా విద్యార్థిని పావని చంద్రిక మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాలలో నాకు 598 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది.. నాకు ఈ మార్కులు రావడానికి మాటీచర్లు, స్కూల్ HM కృషి చేశారు.. మా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా కానీ అమ్మమ్మ ఎంతో జాగ్రత్త తీసుకుని చదివించింది.. భవిష్యత్తులో నేను IAS కావాలని అనుకుంటున్నాను.. ఐఏఎస్ చదవడానికి ప్రభుత్వం కూడా సహకరిస్తే తప్పకుండా విజయం సాధిస్తానని తెలిపింది.

Also Read:Lava Days Sale: ‘లావా డేస్ సేల్’ ప్రారంభం.. లావా అగ్ని 3, O3, O3 Pro ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!

పల్నాడు జిల్లా డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మంచి ఫలితాలు రావడం జరిగింది.. ఈ ఏడాది మంచి ఫలితాలు రావడం శుభ పరిణామం.. పదో తరగతి పరీక్షలలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సూచనలు, సలహాలు బాగా పని చేశాయి.. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Exit mobile version