NTV Telugu Site icon

Dissanayake: ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఏకీభవిస్తున్నా..

Dissanayake

Dissanayake

శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిసానాయకేకి ప్రధాని నరేంద్ర మోడీ ‘X’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో.. సోమవారం దిసానాయక్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రధాని మోడీ, మీ మనోహరమైన మాటలు, మద్దతు కోసం నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.’ అని మోడీ పంపిన మెస్సెజ్‌కు రిప్లై ఇచ్చారు. మన దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై మీ అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. మన ప్రజల ప్రయోజనం, శాంతి కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా మనం కలిసి పనిచేయగలమని దిసానాయకే అన్నారు.

భారతదేశం, శ్రీలంక మధ్య బహుళ కోణాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి.. కలిసి పని చేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని గతంలో ప్రధాని మోడీ ‘X’ లో పోస్ట్ చేసారు. ‘భారతదేశం యొక్క నైబర్ ఫస్ట్ పాలసీ, విజన్ సాగర్‌లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉంది. మా ప్రజల, మొత్తం ప్రాంత ప్రయోజనాల కోసం మా బహుముఖ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో సన్నిహితంగా పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అని ప్రధాని మోడీ అన్నారు.

Pawan Kalyan: తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది..

ఉద్యమం తర్వాత జరిగిన ఎన్నికల్లో శ్రీలంక ప్రజలు అధ్యక్ష పదవికి జనతా విముక్తి పెరమున పార్టీ నాయకుడు దిసానాయక్‌ను ఎన్నుకున్నారు. సోమవారం ఆయన శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక సంక్షోభం తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన సాజిత్ ప్రేమదాస, డిసానాయకేలను అనుర కుమార ఓడించారు. ఆర్థిక సంక్షోభానికి ముందు దేశ రాజకీయాలను ఏకపక్షంగా నియంత్రించిన రాజపక్సే కుటుంబం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఎన్నికల్లో మహిదా రాజపక్సే కుమారుడు నాలుగో స్థానంలో నిలిచారు.

56 ఏళ్ల మార్క్సిస్ట్ నాయకుడు దిసానాయక పార్టీకి గత ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దేశంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజలకు నాయకత్వం వహించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆర్థిక సంక్షోభం సమయంలో దేశాన్ని అధికారాన్ని చేజిక్కించుకున్న రణిల్ విక్రమసింఘే ప్రభుత్వ విధానాలను కూడా ఆయన వ్యతిరేకించారు. ప్రజలపై విధించిన భారీ పన్నులకు వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమించారు. దేశంలోని సమస్యలన్నీ ఒక్క దెబ్బతో ముగిసిపోతాయన్న మాంత్రికుడిని కానప్పటికీ, అందరితో కలిసి ఈ సమస్యలను ఎదుర్కొంటానని దిసానాయక్ తెలిపారు.

Mpox Clade 1: భారత్‌లో కొత్త వేరియంట్ కలకలం.. Mpox క్లాడ్ 1B కేసు నమోదు