NTV Telugu Site icon

Jio star: త్వరలో డిస్నీ+హాట్‌స్టార్‌, జియో సినిమా విలీనం.. తెరపైకి కొత్త డొమైన్‌!

Jio Star

Jio Star

స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 విలీనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ నేడే (నవంబర్ 13) పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. విలీనం తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డిస్నీ+హాట్‌స్టార్‌, జియోసినిమా కలిసి ఒకే స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనున్నాయి. ఈ నేపథ్యంలో జియోస్టార్‌ (JioStar.com) అనే డొమైన్ పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రత్యక్షమైంది. ప్రస్తుతానికి అందులో ‘కమింగ్‌ సూన్‌’ అని కనిపిస్తోంది.

Also Read: Koti Deepotsavam 2024: ఐదవ రోజు కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!

ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. డిస్నీ+హాట్‌స్టార్‌, జియోసినిమా ప్లాట్‌ఫామ్‌ ‘జియోస్టార్‌’ అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నవంబర్‌ 14 నుంచి జియోస్టార్‌ డొమైన్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌, జియో సినిమాలోని కంటెంట్‌ అంతా ఒకే చోట దర్శనమివ్వనుంది. వీక్షకులకు హై-ఎండ్, ప్రీమియం కంటెంట్‌ను ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌), ఫిఫా వంటి ప్రీమియం ఈవెంట్స్ హాట్‌స్టార్‌ యాప్‌లోనే ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. జియోసినిమాలో ప్రో కబడ్డీ లీగ్ ప్రసారం అవుతుందట.

 

 

Show comments