దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఎన్ కౌంటర్ పై తాజాగా నేడు మరోసారి విచారణకు రానుంది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై విచారించాలని హైకోర్టును గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో గత నెల 19న హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో నేడు దిశ ఎన్‌కౌంటర్ కేసుపై మరోసారి విచారణ జరగనుంది. ఎన్కౌంటర్‌లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని బాధితుల తరఫు పిటిషనర్ హైకోర్టును కోరారు. అయితే.. 2019 డిసెంబర్ 6న నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జ్యుడిషియల్ సిర్పూర్కర్ కమిషను ఏర్పాటు చేసింది. ఎన్ కౌంటర్ బూటకం అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది.
Also Read : NIMS : నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ వైద్యుల భర్తీ నోటిఫికేషన్
చట్టపరమైన నిబంధనలను, పోలీస్ మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది కమిషన్. మీడియాకు విచారణ కమిషన్ కు పోలీసులు కట్టుకథలు చెప్పారని కమిషన్ తెలిపింది. ఎన్ కౌంటర్ స్థలంలో సీసీ కెమెరా పుటేజ్ దొరక్కుండా చేసిందని రిపోర్ట్ ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్. దిశ నిందుతులే పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్ధం అని రిపోర్ట్ లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది అధికారులపై సెక్షన్ 302, 201, 34 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు బాధితులు. ఈ కేసులో ఇప్పటికే అమికస్ క్యూరిగా దేశాయ్ ప్రకాష్ రెడ్డిని హైకోర్టు నియమించింది.
Also Read : Hyderabad Metro : మరో 45 రోజుల పాటు హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పెంపు
