Site icon NTV Telugu

Crypto Billionaire: వారం క్రితం అదృశ్యం.. శవమై తేలిన ఫెర్నాండో

Crypto Billianiar

Crypto Billianiar

అర్జెంటీనాలో క్రిప్టోకరెన్సీ ఇన్‌ప్లూయెన్సర్‌ ఫెర్నాండో పెరెజ్ అల్గాబాను దారుణంగా హత్య చేశారు. జూలై 19 నుంచి పోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు. ఒక సూట్‌ కేసులో ఆయన మృతదేహానికి చెందిన శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక కాలువ సమీపంలో సూట్‌కేస్‌లో అల్గాబా విగత జీవిగా కనిపించాడు. కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా అనుమానాస్పద ఎర్రటి సూట్‌కేస్‌ని గుర్తించారు. ఈ విషయాన్ని పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. సూట్ కేసును తెరిచి చూడగా అందులో అల్గాబా కాళ్లు, ఒక చేయి, కొన్ని భాగాలు కనుగొన్నారు. అతని మరో చేయిని కాలువ సమీపంలో కనిపించింది.

Rain Effect : ఏ ఇంటిని కదిలించిన ఒక కన్నీటి గాదె.. 12 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని

ఆ తర్వాత బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలను కూడా పోలీసులు గుర్తించారు. అతని బాడీ మీద ఉన్న వివిధ రకాల టాటూలు, వేలిముద్ర విశ్లేషణ ద్వారా అల్గాబాగా గుర్తించారు. శరీర భాగాలను అటాప్సీకి పంపించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. శరీరాన్ని ముక్కలుగా నరికే ముందు మూడుసార్లు గన్ తో కాల్చారు. ఇదొక ఒక ప్రొఫెషనల్ నేరగాడు చేసుంటాడని అధికారులు భావిస్తున్నారు. అల్గాబా చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం అతని మరణానికి గల కారణాలను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Baby: ‘బేబీ’కి మెగా ప్రశంసలు.. కన్నీళ్లు ఆగడంలేదట!

అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా భారీగా సంపాదించాడు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అతను ఎప్పుడూ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుండే వాడు. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version