NTV Telugu Site icon

Directors Day: ఆరోజే డైరెక్టర్స్ డే ఈవెంట్.. స్టార్ డైరెక్టర్లతో షాకింగ్ ప్లాన్స్..?

Tfi

Tfi

దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలను తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించింది. ఇందులో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, నిర్మాత సి కళ్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కేయ సూర్యనారాయణ, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మే 19వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో దర్శకుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం తేదీతో కూడిన పోస్టర్‌ ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు.

Also Read: Father Son: ఏంటి భయ్యా ఈ కుక్క గోల.. కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తండ్రి.. చివరకి..

దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్‌ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ మాత్రమే కాకుండా అన్ని సినీ కార్మిక సంఘాల సమస్యలను దాసరి పరిష్కరించారని.. సినిమా పరిశ్రమలో ఆయన చాలా పెద్ద మనిషి అని ఆయన తెలిపారు. దర్శక రత్న దాసరి 151 సినిమాల సందర్భంగా 151 మంది దర్శకులను ఈ సందర్బంగా ఆయన సన్మానించారు. ఇకపోతే టాలీవుడ్ కళాతపస్వి కె.విశ్వనాథ్ దాసరి జన్మదినాన్ని పురష్కరించుకొని ఆ రోజు దాసరి గారి పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా నిర్వహించాలని సూచించారని గుర్తు చేసారు. ఈ సంఘటన ఇద్దరు గొప్ప దర్శకుల మధ్య అనుబంధాన్ని సూచిస్తుంది. దర్శకుల దినోత్సవం మే 19న జరగనుంది. మన యువ దర్శకులంతా ఈ వేడుకను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను అని తెలిపారు.

Also Read: Swallowing LED Bulb: ప్రమాదవశాత్తూ ఎల్‌ఈడీ బల్బు మింగిన బాలుడు.. చివరకు..

ఇకపోతే మే 19న జరగబోయే ఈ వేడుకలలో చాలా మంది డైరెక్టర్స్ స్కిట్స్, డ్యాన్సులు.. ఇంకా చాలా పర్ఫార్మెన్స్ లు చేయబోతున్నట్టు తెలిపారు.ఇందులో చాలామంది డైరెక్టర్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇలా తొలిసారిగా డైరెక్టర్స్ అంతా ఒకే చోట చేరి సెలబ్రేట్ చేయబోతుండటమే కాక వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ లు చేయబోతున్నట్లు ప్రకటించడంతో జరగబోయే ఈవెంట్ పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.