Site icon NTV Telugu

Trinadha Rao: మజాకా డైరెక్టర్ ను లైన్ లో పెట్టిన యంగ్ హీరో..?

Trinadha Rao

Trinadha Rao

Trinadha Rao: సినిమా చుపిస్తా మావ.., నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన మరోసారి ‘మజాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన ఆయన తన తదుపరి సినిమాను స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం, ఆయన ఒక హై-ఎనర్జీ ఎంటర్టైనర్ కోసం ప్రామిసింగ్ యువ హీరో ‘హవీష్ కోనేరు’తో జతకట్టాడు. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను డైరక్ట్ చేయడంలో త్రినాధ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హవీష్ తో డబుల్ బ్లాక్ బస్టర్ సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టాడు నక్కిన త్రినాథరావు. ఈ సినిమాను ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సెట్స్ పైకి వెళ్లిందంట. ఇక త్వరలో ఓ మంచి ముహూర్తం చూసుకుని అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Read also: SLBC Tragedy: టెన్నెల్ దగ్గరకు చేరుకున్న ఉస్మానియా వైద్య బృందం

నువ్విలా, జీనియస్, 7 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ కోనేరు, త్రినాథరావు డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో తనను తాను కొత్తగా పరిచయం చేసుకోబోతున్నాడు. కాగా.. ‘నువ్విలా’ సినిమాలో హావిష్ కామెడి టైమింగ్ ఆకట్టుకుంది. ఈ సినిమాకు కొత్త రైటర్ అందించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథతో త్రినాథరావు సినిమా చేస్తున్నాడట. హవీష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఫార్మల్ షూట్ మొదలు పెట్టిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

Exit mobile version