టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ తనలోని అసలైన ‘మెగా’ ఫ్యాన్‌ను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే తనకు ఎంత ప్రాణమో చెబుతూనే, ఆ సినిమాల వెనుక ఉన్న మణిశర్మ మ్యాజిక్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి ‘బావగారు బాగున్నారా’ సినిమాను నేను అర్చన థియేటర్ లో 8 సార్లు చూశాను. ఇక ‘చూడాలని వుంది’ సినిమాను ఏకంగా 23 సార్లు థియేటర్ లో చూశాను. కేవలం మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినడం కోసమే నేను పదే పదే ఆ సినిమాలు చూసేవాడిని’ అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.
Also Read : Dhurandhar : 7.5 గంటల నిడివితో ‘ధురందర్’ స్పెషల్ స్క్రీనింగ్..!
మణిశర్మ అందించే బిజిఎమ్ (BGM) థియేటర్లలో ఇచ్చే హై అలాంటిదని, ఆయన సంగీతం లేకపోతే ఆ సినిమాలు అంతటి ఇంపాక్ట్ ఇచ్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. మణిశర్మ ఒకప్పుడు టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలిన తీరును గుర్తు చేస్తూ, ఆయనతో కలిసి పని చేయడం తన అదృష్టమని సాయి రాజేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం సాయి రాజేష్ నిర్మాణంలో, కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ‘మెలోడీ బ్రహ్మ’ తన మార్క్ వింటేజ్ మ్యూజిక్‌ను టాలీవుడ్‌కు అందిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
