Site icon NTV Telugu

Varanasi: పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చుక్కలు చూపించిన జక్కన్న.. ఒక షాట్ కోసం 94 టేక్‌లు!

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran

Varanasi: దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా వారణాసి చిత్ర బృందం ఓ హాలీవుడ్ మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి పాల్గొని వారణాసికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. తన పాత్రకు సంబంధించిన విషయాలను, రాజమౌళి పర్షెక్షన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

READ ALSO: Directors’ Era: ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్‌.. డైరెక్టర్ల యుగం మొదలైందా?

‘వారణాసి’లో మహేష్ బాబును ఎదుర్కొనే విలన్‌ కుంభగా నటిస్తున్నారు.. పృథ్వీరాజ్. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన పాత్ర గురించి మాట్లాడుతూ.. తాను సినిమాలో అంగవైకల్యం ఉన్న పాత్రలో నటిస్తున్నప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తనది అన్‌ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ అని, డార్క్ లుక్, జక్కన్న పర్ఫెక్షన్ కలిసి తన విలనిజం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ సినిమాలో ఆయన వాడే వీల్ చైర్ గురించి చెబుతూ.. ఈ వీల్ చైర్ కేవలం కూర్చోవడానికి మాత్రమే కాదని, అది తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే ఒక మెకానిజం అని వివరించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి ప్రతి షాట్‌ను ఎంతో పకడ్బందీగా తీస్తున్నారని, ఒక్కోసారి ఒకే షాట్ కోసం రోజంతా 94 టేక్‌లు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు.

READ ALSO: Chinese Car: ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000KM రేంజ్.. -40°C చలిలో కూడా పాడైపోని సూపర్ బ్యాటరీతో సంచలనం

Exit mobile version