Krish Jagarlamudi : ఏడుగురు హీరోయిన్లతో సినిమా..? రూమర్లకు చెక్ పెట్టిన డైరెక్టర్ క్రిష్!

Krish Jagarla Mudi

Krish Jagarla Mudi

‘గమ్యం’, ‘వేదం’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిష్, ఇటీవల అనుష్క శెట్టితో చేసిన ‘ఘాటీ’ చిత్రంతో చాలా రోజులకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. . దీంతో క్రిష్ తన రూట్ మార్చి ఏడుగురు కథానాయికలతో ఒక ‘ట్రెకింగ్ అడ్వెంచర్’ మూవీని ప్లాన్ చేస్తున్నారంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక వార్త విపరీతంగా ప్రచారమైంది.

Also Read : Dhurandhar 2: గల్ఫ్ మార్కెట్‌పై కన్నేసిన ‘ధురంధర్ 2’..

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై క్రిష్ స్పందిస్తూ.. “ఏడుగురు హీరోయిన్లతో ట్రెకింగ్ అడ్వెంచర్ మూవీ అనేది వినడానికి మంచి ఐడియాగానే ఉంది, కానీ అందులో ఏమాత్రం నిజం లేదు” అని తేల్చి చెప్పారు. ఇదంతా కేవలం ఊహాగానమేనని, తన తర్వాతి సినిమా వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య 999’ సీక్వెల్‌కు క్రిష్ దర్శకత్వం వహిస్తారని అందరూ భావించినా, కొన్ని కారణాల వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన మరికొన్ని కొత్త కథలపై కసరత్తు చేస్తున్నారు. క్రిష్ తదుపరి చిత్రం ఏ జోనర్‌లో ఉంటుంది? ఏ హీరోతో ఉంటుంది? అనే విషయంపై టాలీవుడ్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది.