Srikakulam Sherlock Holmes : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తూ వస్తున్న సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘మా ఊరు శ్రీకాకుళం’ టైటిల్ సాంగ్ ని లాంచ్ చేశారు.
Pottel Movie : పొట్టేల్ మూవీ నుంచి “బుజ్జి మేక” రిలీజ్
ఈ పాటకు సునీల్ కశ్యప్ ఈ సాంగ్ ను కంపోజ్ చేయగా., శ్రీకాకుళం గురించి సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఈ పాటలో అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ పాటకు మంగ్లీ ఎనర్జిటిక్ వోకల్స్ మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. అంతేకాకుండా పాట విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. పాట లాంచింగ్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్ సాంగ్ లాంచ్ చేయడం ఎంతో అనందంగా వుందని., టైటిల్ చాలా ఫన్నీగా ఉందన్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ మోహన్ నాకు రైటర్ గా ఉన్నప్పటి నుంచి పరిచయమని., అతను చాలా మంచి రైటర్ అని తెలిపాడు. తాను సాంగ్ చూశానని., మంగ్లీ అద్భుతంగా పాడిందంటూ.. విజువల్స్ కూడా చాలా బావున్నాయని తెలిపారు. ఇక లీడ్ రోల్ చేసిన వెన్నెల కిషోర్ నుంచి ఒక డిఫరెంట్ సినిమా ఎక్సపెక్ట్ చేస్తున్నామని., చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ తెలిపారు.
Dry Coconut: ఎండు కొబ్బరి తినడం వల్ల ఆ ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు..