NTV Telugu Site icon

Deva Katta : ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న దర్శకుడు దేవకట్టా..?

Whatsapp Image 2023 07 27 At 4.59.59 Pm

Whatsapp Image 2023 07 27 At 4.59.59 Pm

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు దేవకట్టా ప్రత్యేకమైనా గుర్తింపు సంపాదించుకున్నారు.దేవ కట్ట వెన్నెల సినిమా తో సినీ పరిశ్రమకి పరిచయం అయ్యాడు. వెన్నెల సినిమా మంచి విజయం సాధించింది..వెన్నెల సినిమా తరువాత ఈయన హీరో శర్వానంద్, సాయికుమార్ కాంబినేషన్ లో ప్రస్థానం అనే సినిమాను తెరకెక్కించాడు.ప్రస్థానం సినిమా అద్భుతమైన విజయం సాధించింది.ఈ సినిమా లో నటుడు సాయికుమార్ చెప్పే డైలాగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి.ప్రస్థానం సినిమా తో ఆయనకి చాలా అవార్డ్ లు కూడా వచ్చాయి.ఈ సినిమా తరువాత వరుస సినిమాలు చేసిన అంతగా ఆకట్టుకోలేదు.. చివరి గా ఈ దర్శకుడు సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఆకట్టుకోక పోయిన మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే రిపబ్లిక్ సినిమా వచ్చి దాదాపు మూడు ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ దర్శకుడు దేవకట్టా మరో సినిమా ని స్టార్ట్ చేయలేదు.దీనికి కారణం ఆయన ఒక పెద్ద హీరో తో సినిమా చేయడానికి ఒక స్క్రిప్టు పనుల్లో బిజీగా వున్నాడని సమాచారం..ఈయన తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఒక మంచి స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే హీరో సూర్య కి లైన్ చెప్పగా ఆ లైన్ తనకి బాగా నచ్చిందని సమాచారం. దీనితో ఫుల్ స్క్రిప్ట్ ను రెఢీ చేసే పనిలో వున్నాడు. ఈ సినిమాను దర్శకుడు దేవకట్టా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాతో కచ్చితంగా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు దర్శకుడు దేవకట్టా. అలాగే సూర్య తో చేసే ఈ సినిమాను తెలుగు తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా భారీ విజయం సాధిస్తే దర్శకుడు దేవకట్టా తెలుగు మరియు తమిళ్ లో ఇండస్ట్రీలలో స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం లభిస్తుంది.