NTV Telugu Site icon

Dimple Hayathi : ఆ స్పెషల్ సాంగ్ తన కెరీర్ కు ప్రాణం పోసింది…!!

Whatsapp Image 2023 06 14 At 10.08.28 Pm

Whatsapp Image 2023 06 14 At 10.08.28 Pm

డింపుల్‌ హయాతి.. డస్కీ బ్యూటీ అయిన ఈ భామ గద్దలకొండ గణేష్ చిత్రం లోని ఐటమ్ సాంగ్ తో వెలుగులోకి వచ్చింది.అందులో ఆడి పాడింది మూడు నిమిషాలే అయిన తన గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులతో కుర్రాళ్లకు బాగా కిక్కెక్కించింది. ‘ఖిలాడి’సినిమాతో ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకునేలా చేసింది ఈ భామ. తాజాగా ‘రామబాణం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అయితే ఆ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్‌గా ఆమె జిమ్‌లో వర్కవుట్ చేస్తోన్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది చూసిన నెటిజన్స్ అంత షాక్ అవుతున్నారు. ఎందుకంటే డింపుల్ చేస్తున్న వర్కవుట్స్ అంత కఠినంగా ఉన్నాయి. జిమ్ ట్రైనర్ అయిన ఓ వ్యక్తి అయితే డింపుల్ హయాతి కిందపడుకుని ఉంటే ఆమె పొట్టపై ఎక్కి నిలుచున్నాడు . అలాగే మరో సందర్భంలో చేతులకు బాక్సింగ్ గ్లవ్స్ ధరించిన వ్యక్తి ఆమె కడుపు పైనే గట్టిగా పంచ్‌లను విసురుతున్నాడు.ఎంతో బాధగా ఉన్నప్పటికీ కూడా డింపుల్ వాటిని భరించింది. తర్వాత జిమ్‌లో మరిన్ని కఠినమైన ఎక్సర్‌సైజులను కూడా చేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గద్దలకొండ గణేష్‌’సినిమా హీరోయిన్ క్యారెక్టర్‌ నేనే చేయాల్సి ఉంది కానీ ఆ సమయంలో ఓ పెద్ద డైరెక్టర్‌తో నేను సినిమాకు కమిట్‌ అయ్యాను. కాల్షీట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక..’గద్దలకొండ గణేష్‌’ సినిమా వదులుకోవాల్సి వచ్చింది. నేను ఒప్పుకున్న పెద్ద సినిమా 90 శాతం షూటింగ్‌ పూర్తయ్యాక అయితే ఆగిపోయింది. డ్యాన్స్‌ రాదని చెప్పి నన్ను ఆ సినిమా నుంచి తప్పించారు. అప్పుడు ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలోనే హరీష్‌ శంకర్‌ ఫోన్‌ చేసి ‘మా సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది మీరు చేస్తారా. అది మీరు చేస్తే బాగుంటుంద’ని ఆయన అన్నారు. ఆ పాట నా కెరీర్ కు ప్రాణం పోసింది…..

Show comments