Site icon NTV Telugu

DILDIYA: చైతన్య రావు న్యూడ్ లుక్‌ను లాంచ్ చేసిన సందీప్ వంగా

Dildiya, Chaitanya Rao,

Dildiya, Chaitanya Rao,

అతి తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో విలక్షణమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు చైతన్య రావు. ‘30 వెడ్స్ 21’ వంటి చిన్న వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయి, ఆ తర్వాత ‘కీడా కోలా’, ‘వకీల్ సాబ్’ వంటి సినిమాలతో పాటు రీసెంట్‌గామయసభ’ సిరీస్‌లో తన వెర్సటైల్ నటనతో ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు. చైతన్య రావు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ దియా’ అనే కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చైతన్య రావు ఏకంగా పూర్తి నగ్నంగా కనిపించి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. మన తెలుగు ఆడియెన్స్ ఈ బోల్డ్ మూవ్‌ను చూసి ఒకింత షాక్ అవుతున్నప్పటికీ, సినిమాపై మాత్రం ఆ ఒక్క లుక్ తో అప్పుడే భారీ హైప్ క్రియేట్ అయింది.

Also Read : Rajini 173: రజనీ–కమల్ మెగా ప్రాజెక్ట్‌కు.. యంగ్ డైరెక్టర్ లాక్ !

ఈ క్రేజీ బోల్డ్ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమాకు ఫణి కళ్యాణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పూర్ణ నాయుడు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ కంటెంట్ పరంగా ఎంతో కొత్తగా ఉండబోతుందట. అంతే కాదు ఈ సినిమాను మేకర్స్ ఈ ఏడాది వేసవి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా సాఫ్ట్ రోల్స్ చేసే చైతన్య రావు, ఇలాంటి ఒక బోల్డ్ అటెంప్ట్ చేయడంతో ఈ సినిమా కథ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అని సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. చైతన్య రావు కెరీర్‌లో ఇది ఒక గేమ్ ఛేంజర్ మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

 

Exit mobile version