Site icon NTV Telugu

అఖండ సక్సెస్… బాలయ్యకు దిల్ రాజు పార్టీ

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సినిమాను నైజాంతో పాటు ఏపీలోని వైజాగ్ ఏరియాకు నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా పంపిణీ చేశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా ఈ సినిమా ద్వారా లాభాలను చవిచూడటంతో దిల్ రాజు అఖండ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి బాలయ్య, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సహా పలువురు దిల్ రాజు సన్నిహితులు హాజరయ్యారు.

మరోవైపు బాలయ్యతో సినిమా చేయాలన్న కోరిక దిల్ రాజుకు ఎప్పటి నుంచో ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ముందు బాలయ్య దగ్గరకే వెళ్లింది. కానీ ప్రాజెక్టు సెట్ కాలేదు. ఇప్పుడు అఖండ సక్సెస్ ఊపులో దిల్ రాజు-బాలయ్య ప్రాజెక్టు సెట్ అయ్యేలా వుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ బాలయ్యతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నాడని టాక్ నడుస్తోంది. కానీ బాలయ్య చేతిలో ప్రస్తుతం మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. అవి పూర్తయ్యాకే దిల్ రాజు సినిమా ఉంటుందని సమాచారం.

Exit mobile version