Karimnagar: కరీంనగర్ బీజేపీ లో విభేదాలు ముదిరుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఉమ్మడి జిల్లా నేతలు నగరంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ కు పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నేతలు హాజరు అయ్యారు. జిల్లాలో కొందరికే ప్రాధాన్యత లభిస్తుందని ఆరోపిస్తూ అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. కరీంనగర్ లో బండి సంజయ్ కు కాకుండా సీనియర్ నేతలకు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో సైతం సీనియర్లకు టికెట్ ఇవ్వాలంటున్న వారు తెలిపారు. బండి సంజయ్ తీరుపై అధిష్టానంకు ఫిర్యాదు చేస్తామని సీనియర్ నేతలు వెల్లడించారు.
Read Also: Pawan Kalyan and Barrelakka: బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా రాలేదు.. పవన్‌పై సీఎం జగన్ సెటైర్లు
ఎంపీ బండి సంజయ్ తీరుతో కరీంనగర్ జిల్లాలో పార్టీ బలహీనం అయిందని కమలం పార్టీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది నేతల కారణంగా ఓడిపోయానని సంజయ్ పేర్కొన్నారు. దీంతో బండి వ్యాఖ్యల నేపథ్యంలో అసంతృప్తుల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ ఎన్నికల ముందు.. అసమ్మతి నేతల తీరుతో.. అధిష్టానంకు తలనొప్పిగా మారింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి, సీనియర్ నేత సుగుణాకర్ రావు, కాసిపేట లింగయ్య హాజరు అయ్యారు.