పెళ్లికి ముందు అబ్బాయిలు పక్కచూపులు చూడటం సహజమే.. కానీ పెళ్లి అయినా తర్వాత కూడా కొందరు మగవాళ్ళు పక్క చూపులు చూస్తుంటారు. వారిని నిందించే ముందు ఒక్కసారి భార్యగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. సహజంగానే ఒక స్త్రీ మగవాడిని అట్రాక్ట్ చేస్తుంది. మీ భర్త అలా పరాయి స్త్రీకి వశమవుతుంటే.. మీలో ఆకర్షణ తగ్గిందేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. పిల్లల ధ్యాసలో పడి మీ ఆకర్షణ శక్తిని కోల్పోకండి. అలాగే పక్క స్త్రీ మీద వ్యామోహం పెంచుకోవడానికి మరొక కారణం ఎంటో తెలుసా.. వైవాహిక జీవితం మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే..
Read Also: Double iSmart: డబుల్ ఇసార్ట్ కూడా ముంబైలోనే మొదలెట్టిన పూరీ
ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా వైవాహిక జీవితం లేకపోతే కూడా ఫ్రస్టేషన్ కి మగవాళ్లు గురౌతుంటారు. అలాంటప్పుడే ఈ ఎక్స్పెక్టేషన్ ని వేరే దగ్గర తీర్చుకోవాలని చూస్తారు. అట్లాగే ఎంతకూ తన భార్య దగ్గర తృప్తి దొరకపోతే కూడా మగవాళ్ళు పక్క చూపులు చూస్తారన్నమాట. తన భార్యలో తనకి కావలసిన అన్ని క్వాలిటీస్ ఉన్నా సరే.. అయినా పక్కవాడి భార్యలో ఇంకేదో క్వాలిటీ కనబడుతుంది.. ఆ క్వాలిటీ కోసం పక్క వాడి భార్య మీద కన్నేస్తాడు. ఇలాంటి వాళ్లని ఎంత తృప్తి పరిచినా తక్కువే.
Read Also: Vinod Kumar: వ్యాగన్ రిపేర్ యూనిట్‌కు మోడీ శంకుస్థాపన చేయడం ఆశ్చర్యకరం
అలాగే కొన్ని సార్లు భార్య తీరుపై అసంతృప్తితో కూడా భర్తని మరో స్త్రీ వైపు చూసేలాగా చేస్తుంది. తన భార్య తనని అర్థం చేసుకోవడం లేదని, తనకి నచ్చినట్లుగా ఉండటం లేదని మగాళ్లు ఏవేవో కారణాలు చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన కారణం నిజమైతే మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి ట్రై చేయ్యండి. లేదంటే మీ పరిస్థితి అతనికి తెలియజేయండి. అలాగే భర్తకి అవసరమైన శారీరక సుఖం ఇవ్వకపోయినా మగవాడి కన్ను మరో ఆడదాని మీద పడుతుంది కాబట్టి.. ఆ విషయంలో కూడా మీ వల్ల ఏదైనా తప్పు ఉంటే దాన్ని సర్థి చెప్పండి.. లేదంటే మీలో లోపం ఉంటే మీ ప్రవర్తన మార్చుకోండి. ఏదైనా సమస్యలుంటే నిపుణుల దగ్గరకు వెళ్లి తగిన సలహాలు తీసుకుని భార్తతో ముందుకు సాగాలి.
