Mahesh Babu : మారిపోయిన మహేష్ బాబు లుక్కు .. అసలు జక్కన్న ప్లానేంటో అర్థం కావడం లేదు
- లుక్ మార్చిన మహేశ్ బాబు
- కీరవాణి కొడుకు ఎంగేజ్ మెంట్ వేడుకలో కొత్త లుక్‌తో షాక్
- కన్ఫ్యూజన్లో పడేసిన సూపర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గె్స్ట్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా దర్శక ధీరుడు రాజమౌళి సంగతి మనకు తెలిసిందే. ఆయన సినిమా తీస్తే కనీసం నాలుగైదు ఏళ్లు సమయం పడుతుంది. సినిమాలో చిన్న లోపం కూడా లేకుండా చూసుకుంటారు ఆయన.. సూపర్ స్టార్ తో సినిమా అంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో వీరి కాంబోలో సినిమా చూడాలంటే మాత్రం మరో నాలుగేళ్లు ఆగాల్సిందే. ఎప్పుడు వచ్చినా ఆ సినిమా మాత్రం ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం మాత్రం పక్కా. అలాంటి సినిమాలో స్టార్ కాస్ట్ కూడా భారీగానే ఉంటుందనడంతో సందేహం లేదు. పలు భాషలకు చెందిన అనేకమంది బిగ్ స్టార్లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫారిన్ వెళ్లి ప్రత్యేకంగా మేకోవర్ అయి వచ్చారు. లాంగ్ హెయిర్ స్టైల్, గెడ్డంతో డిఫరెంట్ లుక్ తో అందరిని ఆకర్షించాడు.
Read Also:RSS Remarks Case: ఆర్ఎస్ఎస్ను తాలిబాన్‌తో పోల్చిన బాలీవుడ్ గీత రచయితకు బిగ్ రిలీఫ్
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
‘SSMB29’ సినిమాలో మహేష్ బాబు అదే లుక్ లో కనిపిస్తాడని అంతా అనుకున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో లో ఏ సినిమాలో కూడా గెడ్డంతో కనిపించలేదు. కచ్చితంగా ఈ కొత్త లుక్ అందరినీ ఎట్రాక్ట్ చేయడం గ్యారెంటీ అని అనుకున్నారు. వచ్చే ఏడాది ‘SSMB29’ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. మొదటిసారి రాజమౌళి హీరో లుక్ ని పబ్లిక్ గా రివీల్ చేసేశారని అంతా భావించారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు కొత్త అవతారంలో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. మొన్నటి వరకు ఉన్న లాంగ్ హెయిర్, గెడ్డం ట్రిమ్ చేసి కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. కీరవాణి తనయుడు శ్రీసింహా ఎంగేజ్ మెంట్ వేడుకకి మహేష్ బాబు హాజరయ్యారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మహేష్ బాబు న్యూ లుక్ లోనే కనిపించడంతో ఇదేంటి సడెన్ గా ఈ మార్పు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు లాంగ్ హెయిర్, గెడ్డంతో ఉన్న లుక్ లోనే మహేష్ బాబు అన్ని ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ వచ్చాడు. దీంతో ‘SSMB29’ లో మహేష్ బాబు అదే లుక్ తో కనిపిస్తాడని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే సడెన్ గా మహేష్ బాబు లుక్ చేంజ్ చేసేశారు. దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులు మరల కన్ఫ్యూజ్ లో పడిపోయారు.
Read Also:IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?