NTV Telugu Site icon

Fact Check: రోహిత్ శర్మకు పాకిస్థాన్‌లో కూడా అంత క్రేజ్ ఉందా? ఈ వైరల్ వీడియోలో నిజమెంత?

Fact Check

Fact Check

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్థాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. ఇక, భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీ మార్చి 9 వరకు కొనసాగుతుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇది.

READ MORE: Vallabhaneni Vamsi Case: టీడీపీ కౌంటర్‌ ఎటాక్‌.. సత్యవర్ధన్‌ కిడ్నాప్ వీడియో విడుదల..

ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మకు పాకిస్థాన్‌లో ఘన స్వాగతం లభించిందని వీడియోలో రాసి ఉంది. ఈ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేస్తున్నారు. పాకిస్థాన్‌లోని ఓ విమానాశ్రయంలో రోహిత్ శర్మకు ఘన స్వాగతం లభించినట్లు కింద రాసి ఉంది. అయితే ఈ వీడియో పాకిస్థాన్‌కి చెందింది కాదు. అక్టోబర్ 3, 2024 నాటి స్పోర్ట్స్ జర్నలిస్ట్ 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢 ట్వీట్‌లో ఈ వీడియో కనిపించింది. ‘మహారాష్ట్రలోని రసిన్‌లో బాస్ రోహిత్ శర్మకు గ్రాండ్ స్వాగతం.’ అని రాసి ఉంది.

READ MORE: Realme: పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్ లోకి రియల్‌మి P3 సిరీస్ విడుదల.. ధర ఎంతంటే?

అంతే కాకుండా.. అక్టోబర్ 4, 2024 నాటి ఇండియా టీవీ విజ్వల్స్ కూడా చెక్ చేశాం. ఈ వార్త ప్రకారం.. రోహిత్ శర్మ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని రసిన్ గ్రామంలో తన కొత్త క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. దీనికి ముందు ఆయనకు ఘన స్వాగతం లభించింది. రోహిత్ తో పాటు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహిత్ పవార్ కూడా ఈ వీడియోలో ఉన్నారు. దీంతో పాకిస్థాన్‌లో హిట్‌ మ్యాన్‌కు ఘన స్వాగతం లభించిందనే వార్త, వైరల్ అవుతున్న వీడియో రెండూ వాస్తవం కాదు..