Diarrhea Cases: జగ్గయ్యపేటలో ఇంకా అదుపులోకి రాని డయేరియా..
- జగ్గయ్యపేటలో ఇంకా అదుపులోకి రాని డయేరియా
- జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి చికిత్స
- ఇద్దరు పేషెంట్లకు విజయవాడలో చికిత్స
- వైద్యాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజులుగా డయేరియా కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తూనే ఉన్నాయి. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పేషేంట్లకు విజయవాడలో చికిత్స అందిస్తున్నారు. కొంత మందికి పరిస్థితి సాధారణమై డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. డయేరియా కేసులపై వైద్యాధికారులతో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. వారం రోజులుగా జగ్గయ్యపేట, నవాబ్ పేట పరిసర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించి పారిశుధ్యం మెరుగుపరచటంపై అధికారులు చర్యలు చేపట్టారు.
Read Also: Frank Duckworth Death: ‘డక్‌వర్త్ లూయిస్’ రూపకర్త ఫ్రాంక్ డక్‌వర్త్ మృతి!
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఈ క్రమంలో.. అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ సుహాసిని తెలిపారు. డయేరియాను అదుపు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత, వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని ఆమె కోరారు. అలాగే, అతిసార వ్యాపించిన గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే.. జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ, గండ్రాయి గ్రామాల్లో పంచాయతీ అధికారులు ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. మంచినీటి ట్యాంకులు శుభ్రంచేయడంతో పాటు క్లోరినేషన్ చేస్తున్నారు. డ్రెయిన్‌లలో పూడికతీత, మురుగునీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్, దోమల వ్యాప్తిని నిరోధించే మందులను పిచికారీ చేస్తున్నారు. దీంతోపాటు.. డయేరియా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.
Read Also: Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి..
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!