NTV Telugu Site icon

Diarrhea Cases: జగ్గయ్యపేటలో ఇంకా అదుపులోకి రాని డయేరియా..

Diarrhea

Diarrhea

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజులుగా డయేరియా కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తూనే ఉన్నాయి. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పేషేంట్లకు విజయవాడలో చికిత్స అందిస్తున్నారు. కొంత మందికి పరిస్థితి సాధారణమై డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. డయేరియా కేసులపై వైద్యాధికారులతో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. వారం రోజులుగా జగ్గయ్యపేట, నవాబ్ పేట పరిసర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించి పారిశుధ్యం మెరుగుపరచటంపై అధికారులు చర్యలు చేపట్టారు.

Read Also: Frank Duckworth Death: ‘డక్‌వర్త్ లూయిస్’ రూపకర్త ఫ్రాంక్ డక్‌వర్త్ మృతి!

ఈ క్రమంలో.. అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ సుహాసిని తెలిపారు. డయేరియాను అదుపు చేసేలా ప్రత్యే­క చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత, వైద్యాధికారుల సలహా­లు, సూచనలు పాటించాలని ఆమె కోరారు. అలాగే, అతిసార వ్యాపించిన గ్రామా­ల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే.. జగ్గయ్యపేట మండలంలోని బూ­ద­వాడ, గండ్రాయి గ్రామాల్లో పంచాయతీ అధికారులు ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. మంచినీటి ట్యాంకులు శుభ్రంచేయడంతో పాటు క్లోరినేషన్‌ చేస్తున్నారు. డ్రెయిన్‌లలో పూడికతీత, మురుగునీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్, దోమల వ్యాప్తిని నిరోధించే మందులను పిచికారీ చేస్తున్నారు. దీంతోపాటు.. డయేరియా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.

Read Also: Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి..