Dhurandhar2 : గుడ్ న్యూస్.. ‘ధురంధర్ 2’ డబ్బింగ్ & సెన్సార్ పూర్తి.. షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు రోజులుగా డబ్బింగ్ మరియు సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ తెలుగు వర్షన్ కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ రీజనల్ లాంగ్వేజ్ డబ్బింగ్, సెన్సార్ క్లియరెన్స్ సమస్యతో రిలీజ్ వాయిదా వేశారు. బుక్ చేసుకున్న టికెట్స్ ను క్యాన్సిల్ చేసి డబ్బులు రిటర్న్ చేసారు. దాంతో అఘమేఘాల మీద వర్క్ ఫినిష్ చేసి తెలుగు మరియు మలయాళ వెర్షన్లు సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ పొందాయి. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Also Read : Dhurandhar2 : రికార్డుల వేటలో ‘ధురంధర్ 2’.. అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన రణవీర్!
Also Read
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
సాధారణంగా కమర్షియల్ సినిమాలు రెండున్నర గంటల నిడివి ఉంటాయి. కానీ ‘ధురంధర్ 2’ మాత్రం ఒక ఎపిక్ లెంగ్త్‌తో రాబోతోంది. సెన్సార్ బోర్డు ఫైనల్ చేసిన వర్షన్ ప్రకారం, ఈ సినిమా తెలుగు మరియు మలయాళ వెర్షన్ల రన్ టైమ్ 231 నిమిషాల 38 సెకన్లు (అంటే దాదాపు 3 గంటల 51 నిమిషాలు). ఇంతటి సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ సినిమాలోని యాక్షన్ మరియు డ్రామా ప్రేక్షకులను మెప్పించింది. సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో పాటు డిజిటల్ కీస్ కూడా థియేటర్లకు కంటెంట్ డెలివరి చేసే వర్క్స్ లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి థియేటర్స్ కు కంటెంట్ వస్తుందని రేపటి (శుక్రవారం) నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో తెలుగు వెర్షన్ షోలు సజావుగా సాగనున్నాయి. నేడు కేవలం హిందీ వెర్షన్‌తో రికార్డులు క్రియేట్ చేస్తున్న ధురంధర్ 2 రేపటి నుండి రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా సందడి చేయబోతుంది. ఈ యాక్షన్ విజువల్ ఫీస్ట్ ఫైనల్ వర్షన్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో చూడాలి.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!