Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dhurandhar Breaks Five Records New Year Box Office

Dhurandhar: ఒకే రోజులో ఐదు రికార్డ్‌లు బ్రేక్ చేసిన ‘ధురంధర్’..

Published Date :January 2, 2026 , 12:29 pm
By Shiva Ganesh
Dhurandhar: ఒకే రోజులో ఐదు రికార్డ్‌లు బ్రేక్ చేసిన ‘ధురంధర్’..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dhurandhar: కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యింది, కానీ ఇప్పటికీ అందరి నోట ఒకే సినిమా పేరు వినిపిస్తోంది.. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసా.. “ధురంధర్.” ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా 28 రోజుల్లో రూ.739 కోట్లు వసూలు చేసింది. అయితే అతిపెద్ద హిందీ చిత్రంగా నిలిచేందుకు “ధురంధర్” సినిమా పుష్ప 2 రికార్డ్‌ను బ్రేక్‌ చేసి భారతదేశంలో రూ.800 కోట్లకు పైగా వసూలు చేయాలి. ఇంతకీ ఈ సినిమా న్యూ ఇయర్ రోజున బ్రేక్ చేసిన ఆ 5 రికార్డ్‌లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Kanaka Durga Temple: బెజవాడ దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం.. వీఐపీ, వీవీఐపీలు టికెట్స్‌ కొనాల్సిందే..!

Also Read

  • Vijay Political Rise: రజనీ, కమల్‌కు సైతం సాధ్యం కాలేదు.. ప్రజానాయకుడిగా మారిన విజయ్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పు..
  • Tamil Nadu Election Results: సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..
  • Mamata Banerjee Biography: అలుపెరుగని పోరాటం.. 34 ఏళ్ల లెఫ్ట్ పాలనను కూల్చిన "దీదీ" ధైర్యం.. ఇదే మమత కథ!
  • Vijay TVK Party: తమిళనాడులో హంగ్ దిశగా ఫలితాలు.. ఆ పార్టీతో టీవీకే విజయ్ పొత్తు?

“ధురంధర్” సినిమా ఇప్పటికి 29 రోజులుగా థియేటర్లలో నడుస్తోంది. గత 28 రోజులుగా సినిమా వసూళ్లు చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. న్యూ ఇయర్‌కు రిలీజ్ అయిన కొత్త సినిమాల వల్ల ఈ సినిమా సింగిల్ స్క్రీన్‌లపై ప్రదర్శనలు తగ్గాయి. అయితే అది “ధురంధర్” తుఫాను ఆపేలా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా సెకండ్ పార్ట్ మార్చి 19న విడుదల కానుంది. ఈ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నూతన సంవత్సరంలో ధురంధర్ సృష్టించిన 5 రికార్డులు ఇవే..

1. అతిపెద్ద చిత్రం: బాలీవుడ్‌లో 28వ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో ధురంధర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సినిమా 28వ రోజు రూ.15.75 కోట్లు వసూలు చేసింది.

2. నాలుగు రూ.1000 కోట్ల సినిమాలను అధిగమించింది: 28వ రోజు ధురంధర్ సినిమా నాలుగు రూ.1000 కోట్ల సినిమాల రికార్డ్‌లను బ్రేక్ చేసింది. 28వ రోజు ధురంధర్ కంటే తక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే.. ఈ జాబితాలో రూ.9.5 కోట్లు వసూలు చేసి పుష్ప 2 తర్వాత స్థానంలో ఉండగా, రూ.2.7 కోట్లతో బాహుబలి 2, రూ.1.86 కోట్లతో జవాన్, రూ.1.85 కోట్లతో KGF 2 ఉన్నాయి.

3. డబుల్ డిజిట్స్: ఈ చిత్రం నూతన సంవత్సర రోజున కూడా తన డబుల్ డిజిట్ వసూళ్ల పరంపరను కొనసాగించింది. వరుసగా 28 రోజులు డబుల్ డిజిట్‌లను సాధించిన అతిపెద్ద చిత్రంగా ధురంధర్ నిలిచింది. జవాన్ లేదా పుష్ప 2 రెండూ దానితో సరితూగలేకపోయాయి. అయితే ఈ చిత్రం ఇలాగే మరొక నెల పాటు ఈ ఘనతను సాధించగలిగితే, అది సరికొత్త రికార్డును సృష్టిస్తుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

4. నాల్గవ వారంలో 100 కోట్లు: ఈ సినిమా నాల్గవ వారం మొత్తం కలెక్షన్లు ఇటీవల వెల్లడయ్యాయి. సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. ఈ సినిమా నాల్గవ వారం ముగిసే సమయానికి రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. 22వ రోజు ప్రారంభమైన ఈ వారం 28వ రోజు నాటికి 106 కోట్లు కొళ్లగొట్టింది.

5. నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాన్ని అధిగమించింది: “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్” 28వ రోజు అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రాలలో ఒకటి. 28వ రోజు ఈ సినిమా దాదాపు రూ.2 కోట్ల వసూళ్లు చేయగా, తాజాగా ఈ రికార్డును “ధురంధర్” అధిగమించింది. ఉరి సినిమా మొత్తం నాలుగు జాతీయ అవార్డులను అందుకుంది. ఉత్తమ దర్శకుడు (ఆదిత్య ధార్), ఉత్తమ నటుడు (విక్కీ కౌశల్), ఉత్తమ నేపథ్య సంగీతం (శశ్వత్ సచ్‌దేవ్), ఉత్తమ సౌండ్ డిజైన్ (బిశ్వదీప్ డి. ఛటర్జీ) అవార్డులను గెలుచుకున్న చిత్రాన్ని ధురంధర్ కలెక్షన్ల పరంగా అధిగమించి నయా చరిత్ర సృష్టించింది.

READ ALSO: Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాధ్యం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood blockbuster 2026
  • Dhurandhar box office records
  • Dhurandhar movie collections
  • Dhurandhar New Year records
  • Dhurandhar part 2 release

తాజావార్తలు

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • Rajasekhar: మొదట శ్రీదేవే పెళ్లి ప్రపోజల్ పెట్టింది.. కానీ జీవిత కోసం అన్నీ వదులుకున్నా..

  • Vijay Political Rise: రజనీ, కమల్‌కు సైతం సాధ్యం కాలేదు.. ప్రజానాయకుడిగా మారిన విజయ్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పు..

  • Tamil Nadu Election Results: సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..

  • Mamata Banerjee Biography: అలుపెరుగని పోరాటం.. 34 ఏళ్ల లెఫ్ట్ పాలనను కూల్చిన “దీదీ” ధైర్యం.. ఇదే మమత కథ!

  • Vijay TVK Party: తమిళనాడులో హంగ్ దిశగా ఫలితాలు.. ఆ పార్టీతో టీవీకే విజయ్ పొత్తు?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions