Site icon NTV Telugu

Dhurandhar: బాక్సాఫిస్‌‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్‌’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి రాయల్ ఎంట్రీ!

Dhurandhar

Dhurandhar

Dhurandhar: చాలా రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో ఉన్న బాలీవుడ్ బాక్సాఫిస్‌కు ఫుల్ మీల్స్ అందించిన చిత్రంగా ధురంధర్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫిస్‌ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకొని, భారీ వసూళ్లు సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అలాగే ఈ ఏడాదిలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది.

READ ALSO: Israel: “నమాజ్” చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయిల్ సైనికుడు..

రిలీజ్ అయిన డే వన్ నుంచి కూడా ఈ సినిమా కలెక్షన్లలో టాప్‌లో దూసుకుపోతుంది. ‘ధురంధర్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 21వ రోజు కూడా రూ.26 కోట్లను సాధించింది. ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1006 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 21వ రోజు కూడా 4,753 థియేటర్‌లలో విజయవంతంగా నడుస్తుంది. దర్శకుడు ఆదిత్య ధర్‌ కెరీర్‌తో పాటు హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కెరీర్‌లోనూ ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా భారత్‌లో రూ.668 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానున్న ‘ధురంధర్‌ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిక్వెల్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ కాకుండా దక్షిణాది భాషల్లోనూ విడుదల చేస్తున్నారని టాక్ నడుస్తుంది.

READ ALSO: Amaravathiki Ahwanam: అమరావతికి ఆహ్వానం పలుకుతున్న సురేఖ వాణి కూతురు..

Exit mobile version