Site icon NTV Telugu

Dhurandhar 2 – Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. సౌత్ ఆడియెన్స్ ఓటు ఎవరికో?

Durandhar2, Toxic

Durandhar2, Toxic

ప్రస్తుతం ‘ధురంధర్’ ఓటీటీలోకి రావడంతో సౌత్ ఆడియెన్స్‌లో ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. ఈ ఊపును చూస్తుంటే మార్చి 19న విడుదల కాబోతున్న ‘ధురంధర్ 2’కి దక్షిణాదిన తిరుగులేని ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో కన్నడ స్టార్, రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్ వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ‘ధురంధర్ 2’ హవా ముందు ‘టాక్సిక్’ కాస్త వెనుకబడిందనే చర్చ సాగుతోంది.

Also Read : Brahmanandam : నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం వాళ్లే”: పుట్టినరోజు వేళ ఎమోషనల్ అయిన బ్రహ్మానందం!

సాధారణంగా సౌత్ స్టార్ హీరోలకు ఇక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కానీ, ‘ధురంధర్’ సినిమాకు ఉన్న మ్యాజిక్ వల్ల రణ్వీర్ సినిమాకే ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. యష్ ‘టాక్సిక్’ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, ధురంధర్ పార్ట్-2 కోసం సౌత్ ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ ఇద్దరు స్టార్ల మధ్య పోరు ఎలా ఉండబోతుందో, ఏ సినిమా బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version