Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ ‘రివెంజ్’ షురూ.. సినిమాలో యామీ గౌతమ్ సర్ప్రైజ్ రోల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ వెండితెరపై మరోసారి అద్భుతం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ రేపు (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయనుంది. అయితే, ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఒక ‘సీక్రెట్ ఎలిమెంట్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదే.. అందాల నటి యామీ గౌతమ్ ఎంట్రీ!
READ ALSO: SRH New Captain: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ ఇతడే..
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకనే తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
యామీ గౌతమ్ సర్ప్రైజ్ ఎంట్రీ..
గత కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ సినిమాలో యామీ గౌతమ్ ఒక మెరుపు తీగలా మెరవబోతున్నట్లు సమాచారం. ఆమె ‘షాజియా బానో’ అనే డాక్టర్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎండ్ క్రెడిట్స్ స్క్రీన్షాట్లు (YG) ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేశాయి. కేవలం అతిథి పాత్రగానే కాకుండా, హీరో మిషన్‌లో ఈ డాక్టర్ పాత్ర అత్యంత వ్యూహాత్మకమైన మలుపుకు కారణం కానుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఇందులో విశేషమేమిటంటే, ఈ చిత్రానికి యామీ గౌతమ్ భర్త, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. సినిమాలో వచ్చే ఒక కీలక ఆసుపత్రి సన్నివేశంలో యామీ ఎంట్రీ ఉంటుందని, అది ప్రేక్షకులని థ్రిల్‌కు గురిచేస్తుందని తెలుస్తోంది. రణవీర్ సింగ్ ఇందులో ‘హమ్జా అలీ మజారీ’ అనే పవర్ఫుల్ రోల్లో తన నట విశ్వరూపం చూపించబోతున్నారు. రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి హేమాహేమీలు ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. ‘ధురందర్’ మొదటి భాగం సృష్టించిన ప్రభంజనంతో, ఈ క్రేజీ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మార్చి 18(నేటి) నుంచే పెయిడ్ ప్రివ్యూలు షురూ కావడంతో, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు.
BREAKING- #YamiGautam as Doctor in #DhurandharTheRevenge . pic.twitter.com/MRM5VkXunm
— The Climax India (@TheClimaxIndia) March 14, 2026
తాజావార్తలు
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకనే తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్‌కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్‌తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!