Dhurandhar 2: ఆదిత్య ధర్ ఓపెన్ లెటర్.. పార్ట్ 3 పై సంచలన పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ ఏవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్: ది రివెంజ్’ విడుదలకు రంగం సిద్ధమైంది. సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ రేపు (మార్చి 19, 2026) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల సీజన్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు ఆదిత్య ధర్ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ఒక విన్నపం చేశారు. సినిమాలోని ట్విస్టులు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను రివీల్ చేయవద్దని, స్పాయిలర్స్ ఇవ్వకుండా ఇతరుల ఉత్సాహాన్ని దెబ్బతీయొద్దని కోరారు. అలాగే ఈ సినిమా ఎండ్ కార్డ్స్ పడే వరకు సీట్లో నుంచి లేవ వద్దని చెప్పారు. దీంతో ధురంధర్-3 కూడా ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. మిడ్నైట్ షోలు, ప్రీమియర్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది.
READ ALSO: Yamaha Scooter: కార్లకే కాదు.. స్కూటర్‌కి కూడా ఎయిర్‌బ్యాగ్.. యమహా ట్రైసిటీ 300 రివల్యూషన్
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రణవీర్ సింగ్ ‘మాస్’ విశ్వరూపం..
ధురందర్ పార్ట్ వన్ హిందీలో సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెండో భాగం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతుంది. రణవీర్ సింగ్ ఇంటెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తుండగా.. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు. “ఇది కొత్త భారత్.. ఇంట్లోకి జొరబడి మరి కొడుతుంది” అనే డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా నిడివి (Run-time) ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 3 గంటల 49 నిమిషాల (229 నిమిషాలు) సుదీర్ఘ నిడివితో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఉన్న ఇంటెన్స్ యాక్షన్, హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ (Adults Only) సర్టిఫికేట్ జారీ చేసింది. శాశ్వత్ సచ్దేవ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్ర బృందం చెబుతుంది.
Om 🙏
Book Your Tickets Now.
🔗- https://t.co/O80GmnSaFW #DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.Hindi | Telugu | Tamil | Kannada | Malayalam @RanveerOfficial @rampalarjun @duttsanjay @ActorMadhavan #AkshayeKhanna #SaraArjun… pic.twitter.com/PwNMwzt5Gh
— Aditya Dhar (@AdityaDharFilms) March 18, 2026
READ ALSO: Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో.. రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్‌కు యువ క్రికెటర్ ఫిదా!
తాజావార్తలు
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!