Dhurandhar 2: ధురంధర్ 2 లో పాకిస్థాన్ మాజీ ప్రధాని..
- బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' సంచలనం..
- పాత, కొత్త పాత్రల సందడి ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: ప్రస్తుతం సినీ ప్రపంచంలో ‘ధురంధర్ 2’ పేరు మార్మోగిపోతోంది. ‘ధురంధర్: ది రివెంజ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజే రికార్డులను బద్దలు కొట్టింది. రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటుల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ పాత్రలతో పాటు కొన్ని కొత్త పాత్రలు కూడా చేరడం విశేషం. ఈ స్టోరీలో ఆ పాత్రల వివరాలను తెలుసుకుందాం.
READ ALSO: GaddarFilmAwards : సినిమా వాళ్లని ఎంకరేజ్ చేయడంలో AP వెనుకబడి ఉంది – చిరంజీవి
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
రణవీర్ సింగ్ యాక్షన్..
ఈ చిత్రం మొత్తంలో రణవీర్ సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన ఈ సినిమాలో హమ్జా అలీ మజారీ, జస్కిరత్ సింగ్ రంగీ అనే రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఫస్ట్ పార్ట్‌లో బందిపోటు రాజు రెహమాన్ శిష్యుడిగా కనిపించిన రణవీర్, రెండో పార్ట్‌లో శత్రువుల సింహస్వప్నమైన ల్యారీ రాజుగా మెప్పించారు.
ఆర్.మాధవన్
ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్‌గా మళ్లీ తెరపై కనిపించారు.. ఆర్.మాధవన్. ఈ పాత్ర జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్ఫూర్తితో రూపొందించినట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్‌లో ఆయన నటన సినిమాకు ఏ రేంజ్‌లో ప్లస్ అయ్యిందో తెలిసిందే. సెకండ్ పార్ట్‌లో ఆయన తన అదిరిపోయే నటనతో స్రీన్‌పై అద్భుతం చేశారు.
అర్జున్ రాంపాల్: భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా మరింత పవర్‌ఫుల్ పాత్రలో నటించారు అర్జున్ రాంపాల్.
సంజయ్ దత్: ల్యారీ టాస్క్ ఫోర్స్ అధిపతి ఎస్పీ చౌదరి అస్లాం పాత్రలో తనదైన ముద్ర వేశారు సంజయ్ దత్.
గౌరవ్ గేరా: పాకిస్థాన్‌లో భారత గూఢచారి మహమ్మద్ ఆలమ్‌గా పాత పాత్రనే కొనసాగించారు.
ఈ సినిమాలో కొత్తగా చేరిన తారలు వీరే..
ఈసారి చిత్ర బృందంలో పలువురు కొత్త నటులు చేరి సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు.. వారు ఎవరంటే..
సలీం సిద్ధిఖీ: మాఫియా నాయకుడు అతీక్ అహ్మద్ స్ఫూర్తితో రూపొందించిన ‘ఆతిఫ్ అహ్మద్’ పాత్రలో సలీం ఒదిగిపోయారు.
యామీ గౌతమ్: షాజియా బానో అనే నర్సు పాత్రలో మెరిశారు యామీ గౌతమ్.
మష్నూర్ అమ్రోహి: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోలికలతో ఉండే ‘నవాబ్ షఫిక్’ పాత్రలో అద్భుతంగా నటించారు.
డానిష్ ఇక్బాల్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం స్ఫూర్తితో రూపొందించిన ‘బడే సాహెబ్’ పాత్రలో డానిష్ నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
ఇతర కీలక పాత్రలు ఇవే..
సినిమాలో మానవ్ గోహిల్ (ఐబీ డిప్యూటీ డైరెక్టర్), రాకేష్ బేడీ (రాజకీయ నాయకుడు జమీల్ జమాలి), కార్ల్ ఆండ్రూ హార్ట్ (డేవిడ్ హెడ్లీ) తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫస్ట్ పార్ట్‌లో అక్షయ్ ఖన్నా పోషించిన ‘రెహమాన్’ పాత్ర ఈ భాగంలో లేకపోవడాన్ని అభిమానులు మిస్ అవుతున్నప్పటికీ, మిగిలిన పాత్రల లోతు ఆ లోటును భర్తీ చేసిందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి, వాస్తవ సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా రూపొందించిన పాత్రలతో ‘ధురంధర్ 2’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!