NTV Telugu Site icon

Kethireddy Venkatarami Reddy: గుంతలు పూడ్చడం కాదు.. టెండర్లు ఇప్పిస్తా రోడ్డు పూర్తి చేయి..!

Kethireddy Venkatarami Redd

Kethireddy Venkatarami Redd

Kethireddy Venkatarami Reddy: ధర్మవరంలో నాలుగు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే సూరి ప్రచార ఆర్భాటం కోసమే హడావుడి చేస్తున్నాడని దుయ్యబట్టారు.. టీడీపీలో టికెట్ కోసం పరిటాల శ్రీరామ్ తో పోటీపడేందుకే సూరి రోడ్ల గుంతల మరమ్మత్తుల కార్యక్రమం జిమ్మిక్కు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిందని తెలుసుకున్న తర్వాతే సూరి గుంతలు పూడ్చే కార్యక్రమంతో నాటకాలు ఆడుతున్నారని ఫైర్‌ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణకు దమ్ముంటే గుంతలు పూడ్చడం కాదు.. నాలుగు కోట్ల రూపాయల టెండర్లు ఇప్పిస్తాను రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి అంటూ సవాల్‌ చేశారు. ఇక, 4 వేల కోట్ల రూపాయిల అవినీతి అంటున్నాడు.. అందులో 10 శాతం ఇస్తే నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాను అని బహిరంగా సవాల్ విసిరారు. మరో రెండు నెలలో ఎన్నికలు వస్తాయనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

Read Also: IND vs ENG: విశాఖలో రోహిత్ శర్మ రికార్డులు అదుర్స్.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలే!