NTV Telugu Site icon

Dharmana Prasada Rao : నేను ఎవరో జడిపిస్తే జడిసే రకం కాదు..

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

శ్రీకాకుళం కత్తెర వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎవరో జడిపిస్తే జడిసే రకం కాదని, 40 ఏండ్లుగా వాస్తవాలు మాటాడుతునే ఉన్నాని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నా నోరు మూయాలని బాణాలు సందిస్తుంటారు.? అని మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. భూములు దోచేసానంటూ ఆరోపిస్తుంటారని, ప్రజల తరుపున నా గొంతు మాట్లాడుతునే ఉంటుందని ఆయన తెలిపారు. ధర్మ బద్దంగా ఓ ఆదాయం కోసం పని చేస్తే తప్పని చూపిస్తున్నారని, నేను ఏంటో .. నా క్యారెక్టర్ ఏంటో నాసన్నిహితులు , నా పౌరులు చెప్పాలన్నారు.

Also Read : Stalin: ఆ చిత్రానికి జాతీయ అవార్డు ఇవ్వడంపై మండిపడ్డ సీఎం స్టాలిన్

75 ఏండ్ల లో ఉన్న ప్రభుత్వాలు ఏం చేసాయని ఆయన అన్నారు. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏం చేసారో చెప్పాలి కదా అని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఏం చేయకుండా , నాలుగేండ్లు కిడ్ అయిన ప్రభుత్వాన్ని అడగటం ఏంటి‌? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకి శ్రీకాకుళం అంటే నిర్లక్యమని, రాష్ర్ట విభజనలో 23 సంస్దలు వస్తే , న్యాయబద్దంగా రావాల్సిన రెండు సంస్దలు‌కూడా పెట్టలేదని మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. మేం ఏం పాపం చేసాం, శ్రీకాకుళంకు ఏమీ చేయలేదని, చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాను చులకనగా చూస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాద రావు మండిపడ్డారు.

Also Read : Slum Dog Husband : ఓటీటీ లో ట్రెండింగ్ గా నిలిచిన ఫన్ టాస్టిక్ మూవీ..